Vijay Devarakonda- Puri Jagannadh: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ.. విజయ్ ఫ్యాన్స్ లో రోజురోజుకు ఈ సినిమా పై ఆసక్తి రెట్టింపు అవుతుంది. అందుకే, చిత్రబృందం కూడా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ లో తనకు నచ్చేది నిజాయితీ అని పూరి చెప్పుకొచ్చాడు.

నిజంగా విజయ్ దేవరకొండలో అంత నిజాయితీ ఉందా ?, పూరి చెప్పినట్టు.. ఒక నిర్మాత విజయ్ కి కోటి రూపాయిలు ఇస్తే.. వద్దు ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండని చెబుతాడా ?, గతంలో ఓ సినిమా విషయంలో విజయ్ డబ్బుల కోసం నిర్మాతతో గొడవ కూడా పడ్డాడు. సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. మరి అలాంటి విజయ్ కి రెండు కోట్లు పంపిస్తే.,,. నిర్మాతకు అప్పులున్నాయని తెలిసి.. ముందు అప్పులు తీర్చమని తిరిగిపంపించేసాడట.
Also Read: Patriotic Movies In Telugu: సినీమాతరాన్ని పలికించిన హీరోలు వీరే.. అందరికీ వందనాలు
ఇదే కొంచెం నమ్మశక్యంగా లేదు. ఈ రోజుల్లో ఇలా ఎవరంటారు . ?. ఏది ఏమైనా విజయ్ గురించి పూరి చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవు. ఏది ఏమైనా లైగర్ గురించి చాలా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే.. విజయ్ రేంజ్ రెట్టింపు అయినట్టే. ఇక ‘లైగర్’ సినిమా ఎక్స్ క్లూజివ్ బిజినెస్ డీటెయిల్స్ ఇప్పుడు మీ కోసం. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను లైగర్ థియేటర్ రైట్స్ ను కొనుక్కున్నారు.

అయితే, ఇక్కడ ఒక విశేషం ఉంది. లైగర్ సినిమా పాన్ ఇండియా సినిమా. అన్నీ సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా లైగర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కరుణ్ జోహార్ ఈ చిత్రాన్ని హిందీలో ఓన్ గా రిలీజ్ చేస్తున్నాడు. మిగిలిన అన్ని దక్షిణాది రాష్ట్రాలలో వరంగల్ శ్రీను రిలీజ్ చేయబోతున్నాడు.
ఈ క్రమంలో వరంగల్ శ్రీను షాకింగ్ రేట్ కి లైగర్ దక్షిణాది రాష్ట్రాల థియేటర్ రైట్స్ కొనుక్కున్నాడు. ఇంతకీ ఆ రేట్ ఎంత అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా ?. ఏకంగా 70 కోట్లకు లైగర్ రైట్స్ కొన్నాడు వరంగల్ శ్రీను. చివరగా ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి. స్టార్ హీరోల రేంజ్ లో విజయ్ దేవరకొండ తన లైగర్ బిజినెస్ తో సరికొత్త రికార్డులు నమోదు చేశాడు.
Also Read:Prabhas Cap: ప్రభాస్ కు ఆ సమస్య.. అందుకే క్యాప్ పెట్టుకుంటున్నాడా?
[…] […]