Prashanth Neel- NTR: #RRR సినిమా తర్వాత అభిమానులందరూ ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు..కొరటాల శివ తో ఆయన ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ప్రకటించారు కానీ ఇప్పటి వరుకు కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోలేదు..దానికి కారణాలు సోషల్ మీడియా ఎన్నో వినిపిస్తున్నాయి..కానీ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ చిత్రం ఇప్పట్లో ప్రారంభం అయ్యే సూచనలు కనిపించడం లేదు..సెట్స్ పైకి వెళ్లాల్సిన సినిమా గురించి ఉలుకు పలుకు లేకుండా ఉంటే, ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా తర్వాత చెయ్యబొయ్యే ప్రాజెక్ట్ గురించి అప్పుడే ఒక ప్రకటన వచ్చేసింది..అదేమిటి అంటే ఎన్టీఆర్ KGF సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే వార్త మన అందరికి తెలిసిందే..ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసారు.

Prashanth Neel- NTR
అయితే ఈరోజు ప్రభాస్ హీరో గా నటించిన సలార్ మూవీ కొత్త పోస్టర్ ని విడుదల చేస్తూ మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు ప్రశాంత్ నీల్..వచ్చే ఏడాది సెప్టెంబర్ ౩౦ వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో విడుదల కాబోతుంది ఈ సినిమా..ఈ సందర్భంగా ఆయన మీడియా తో కూడా మాట్లాడారు..మీ తదుపరి సినిమా ఎవరితో అని అడిగిన ప్రశ్న కి ప్రశాంత్ నీల్ సమాధానం ఇస్తూ..’నా తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో ఉంటుంది.

Prashanth Neel- NTR
వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వ తారీకు నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది’ అని చెప్పాడు..ఎప్పుడైతే ఆయన ఈ ప్రకటన చేసారో..ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యాయి..ఈ సినిమాకి ‘రేడియేషన్ సూట్’ అనే టైటిల్ ని పెట్టడానికి ఆలోచిస్తున్నారు..ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ప్రశాంత్ నీల్ లాంటి ఊర డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహకి కూడా అందదు..మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈ ఇద్దరి కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ ని సృష్టిస్తుందో చూడాలి.