China- Taiwan Conflict: తైవాన్.. ఒకప్పుడు ప్రపంచానికి అంతగా పరిచయం లేని చిన్న ద్వీపం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిపేరు మార్మోగుతోంది. చైనాకు ఆనుకొని ఉండే తైవాన్‌ను చైనా ఎప్పటి నుంచో తమలో అంతర్భాగం అంటోంది. కానీ తైవాన్ కాదంటోంది. తమది సొంత దేశం అంటోంది. ఇది ఇప్పటి పోరాటం కాదని కొంతమంది అంటే.. తైవాన్‌లోని కొంతమంది స్వార్ధపరుల వల్లే మళ్లీ మాకు ఈ సమస్య వచ్చిందని మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైతేనేం.. ఎన్నో ఏళ్లుగా తటస్థంగా ఉన్న చైనా దేశం తాజాగా తైవాన్ ఎదురుతిరుగుతుండడం.. అమెరికాతో చెలిమి చేస్తుండడంతో మరోసారి అగ్గి రాజుకుంది. చైనా-అమెరికా మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో తైవాన్ పావుగా మారింది. ఈ నేపథ్యంలో అసలు తైవాన్ అంటే చైనాకు ఎందుకు అంతా అక్కసు? తైవాన్ చైనాలో అంతర్భాగమేనా? అసలు తైవాన్ గురించి చరిత్ర ఏం చెబుతోందో తెలుసుకుందా.

–తైవాన్ చరిత్ర ఏమిటి?
తైవాన్ ద్వీపం దక్షిణ చైనా సముద్రంలో చైనాకు కింద ఉంటుంది. చైనాకు ప్రధాన భూభాగం నుంచి కేవలం వంద మైళ్ల దూరంలో ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాలు తైవాన్‌ను గుర్తించలేదు. అయినా అది అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థను కలిగి ఉంది. ఇప్పుడు అది కూడా పనిచేస్తున్న పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం.
-రాజధాని, ప్రధాన నగరాలు
తైవాన్ రాజధాని తైపీ. 2011 జనాభా లెక్కల ప్రకారం 23.2 మిలియన్ల జనాభా ఉంది. తైవాన్‌లో న్యూ తైపీ సిటీ, కాయోహ్సుంగ్, తైచుంగ్, టైనన్ ప్రధాన నగరాలు. తైవాన్ ను అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రాంతంగా గుర్తించింది.. 20 సంవత్సరాల వయస్సు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులకు గుర్తింపునిచ్చింది.
-ప్రపంచం గుర్తించని దేశం..
తైవాన్ సంపన్నమైన, పూర్తిస్థాయిలో పనిచేసే ప్రజాస్వామ్యం అయినప్పటికీ, అనేక ఇతర దేశాలు దీనిని దౌత్యపరంగా గుర్తించలేదు. తైవాన్‌తో 25 దేశాలు మాత్రమే దౌత్య సంబంధాలు కలిగివున్నాయి. వీరిలో ఎక్కువ మంది ఓషియానియా లేదా లాటిన్ అమెరికాలో చిన్న దేశాలు ఉన్నాయి. ఎందుకంటే చైనా యొక్క పీపుల్స్ రిపబ్లిక్ (చైనా ప్రధాన భూభాగం) తైవాన్ ను గుర్తించిన దేశాల నుంచి తన దౌత్యవేత్తలను దీర్ఘకాలంగా వెనక్కి తీసుకుంది. తైవాన్‌ను అధికారికంగా గుర్తించే ఏకైక యూరోపియన్ రాష్ట్రం వాటికన్ నగరం.
–తైవాన్ జనాభా
తైవాన్‌లో దాదాపు 98% జాతి హాన్ చైనీయులు ఉన్నారు. అయితే వారి పూర్వీకులు ఈ ద్వీపానికి తరలివెళ్లారు. అనేక భాషలలో మాట్లాడతారు. జనాభాలో దాదాపు 70% మంది హోక్లో ఉన్నారు. అంటే వారు 17వ శతాబ్దంలో వచ్చిన దక్షిణ ఫుజియాన్ నుంచి వచ్చిన చైనీస్ వలసదారులు ఇక్కడ స్థిరపడ్డారు. మరో 15% హక్కా , మధ్య చైనా నుంచి ప్రధానంగా గుయంగ్డోంగ్ ప్రావీన్స్ నుంచి వలస వచ్చిన వారి వారసులు. క్కిన్ షివాంగడి (246 – 210 బీసీ) పాలన తరువాత హక్కా అయిదు లేదా ఆరు ప్రధాన వర్గాలుగా ఇక్కడ జనాలు ఉన్నారు..
-స్వతంత్ర దేశం కాదు.. మాలో అంతర్భాగమే..
తైవాన్ స్వతంత్ర దేశం కాదని, చారిత్రకంగా తమ భూభాగమే అని చైనా అంటుంది. అయితే తైవాన్‌లోని మోజారీటీ యువకులు తాము స్వతంత్రంగానే ఉంటామని అంటున్నారు. ప్రస్తుత స్థితిలో తైవాన్‌లో ప్రత్యేక ప్రభుత్వం ఉంది. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతోంది. రాజకీయంగా మాత్రం గుర్తింపు లేదు. చైనా రికార్డులను పరిశీలిస్తే 2 వేల ఏళ్ల క్రితమే తైవాన్ దీవి చైనాలో అంతర్భాగంగా ఉండేది. క్రీస్తు శకం 239లో ఈ ప్రస్తావన ఉంది. అందుకే చైనా.. తైవాన్ తమదే అంటుంది. చైనాను పాలించిన చివరి రాజవంశం చంగ్‌డైనాస్టియన్ (1683 నుంచి 1895) సుమారు 200 ఏళ్లు పాలించింది. 17వ దతాబ్దంలో అనేకమంది తైవాన్‌కు వలస వెళ్లారు.

–యుద్ధం తర్వాత..
చైనాలోని చివరి రాజవంశానికి, జపాన్‌కు మధ్య 1885 తర్వాత యుద్ధం జరిగింది. ఈ సమయంలో చైనా రాజవంశం ఓడిపోవడంతో జపాన్.. సముద్రంలోని తైవాన్‌ను స్వాధీనం చేసుకుంది. 1895 నుంచి 1945 వరకు తైవాన్ జపాన్ ఆధీనంలోనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఓడిపోయింది. ఈ సమయంలో తైవన్‌ను వదిలేస్తున్నట్లు జపాన్ ఒప్పందంపై సంతకం చేసింది.
-1949లో రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భావం..
1949 వరకు కొమిన్‌టన్లు తైవాన్ కేంద్రంగా పాలన సాగించారు. అయితే తర్వాత కమ్యూనిస్టులకు కొమిన్‌టన్లకు మధ్య యుద్ధం జరిగింది. ఇందులో కమ్యూనిస్టులు విజయం సాధించారు. దీంతో చైనా బీజింగ్ రాజధానిగా కమ్యూనిస్టులు రిపబ్లిక్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. యుద్ధం తర్వాత తైవాన్ పారిపోయిన కొమిన్‌టన్లు అక్కడ ప్రత్యేక పరిపాలనా విభాగం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో సోవియట్ యూనియన్ చైనా ప్రభుత్వాన్ని గుర్తించగా, అమెరికా నాయకత్వంలో తైవాన్‌లోని ప్రభుత్వాన్ని గుర్తించారు. ఐక్యరాజన్య సమితి కూడా తైవాన్‌లోని ప్రవాస ప్రభుత్వాన్ని గుర్తింపు ఉండేది. తర్వాత కాలక్రమేణా.. ఇది సాధ్యం కాలేదు. తైవాన్ లో వారి జనాభా తక్కువ, చైనీయుల జనాభా ఎక్కువ ఉండడంతో చాలా దేశాలు తర్వాత తైవాన్‌ను గుర్తించకుండా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగానే గుర్తించారు. 1971లో ఐక్య రాజ్య సమితి కూడా బీజింగ్ రాజధానిగా ఉన్న చైనానే గుర్తించింది. దీంతో తైవాన్‌కు ఐక్యరాజ్యసమితి గుర్తింపు కోల్పోయింది.
–1979లో ఆర్థిక సంస్కరణలతో..
చైనాలో 1979 అధికారం చేపట్టిన డెంగ్ జియోపింగ్ అధ్యక్షుడు అయ్యాక చైనాలో ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశారు. దీంతో అప్పటిదాకా తైవాన్‌ను గుర్తించిన అమెరికా ఈ సంస్కరణలతో పెట్టుబడుల కోసం చైనాను గుర్తించడం మొదలు పెట్టింది. తర్వాత చాలా దేశాలు తైవాన్‌తో సంబంధాలు తెంపుకున్నాయి.
-స్వపరిపాలన..
అంతర్జాతీయ గుర్తింపు లేకున్నా తైవాన్‌లో స్వపరిపాలన సాగుతూ వస్తోంది. చాలాకాలం కొమిన్‌టన్లు ఏకస్వామయ్య పాలన సాగించారు. చివరకు 2004లో డెమక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొమిన్‌టన్లు తైవాన్ చైనాలో అంతర్భాంగంగా ఉండేందుకు ఇష్టపడగా.. డెమక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్రభుత్వం మాత్రం స్వతంత్ర తైవాన్ కోసం పనిచేస్తోంది. 2008లో మళ్లీ కొమిన్‌టన్ల పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 2016, 2020లో మళ్లీ డెమొక్రటిక్ పార్టీ అధికారం చేపట్టింది. అయితే తైవాన్ చైనాతో మాత్రం ఆర్థిక, వాణిజ్య సంబధాలు పెంచుకుంటూ పోతోంది. చైనాలో పెట్టుబడులు కూడా పెట్టింది. ఆర్థిక, వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. కానీ రాజకీయంగా చైనా ఆధిపత్యాన్ని ఆమోదించడం లేదు. తైవాన్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. చైనాలో కలువకుండా స్వేచ్ఛగా బతకాలని ఆశిస్తున్నారు.
చైనా మాత్రం ఎప్పటికైనా తైవాన్‌ను సామరస్యంగా విలీనం చేసుకోవాలని భవిస్తోంది. గతంలో స్వపరిపాలన చేసుకుంటూ చైనా కింద పనిచేయాలని ఆఫర్ ఇచ్చింది. దీనిని తైవాన్ వ్యతిరేకించింది. దీంతో చైనా కొత్త చట్టం చేసింది. తైవాన్ స్వతంత్రం ప్రకటించుకుంటే బలప్రయోగం తప్పదని దీని ముఖ్య ఉద్దేశం. దీంతో యథాతధ స్థితినే కొనసాగించేందుకు అటు తైవాన్, ఇటు చైనా సుముఖత చూపుతున్నాయి. అయితే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న అమెరికా మాత్రం తైవాన్‌ను పావుగా వాడుకుంటోంది. తైవాన్ ను వాడుకొని చైనాను యుద్ధరంగంలోకి దింపి దెబ్బతీయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read:Prabhas Cap: ప్రభాస్ కు ఆ సమస్య.. అందుకే క్యాప్ పెట్టుకుంటున్నాడా?
[…] […]