Puri Jagannadh and Ramaprabha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagamnadh)… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడంలో కూడా ఆయన చాలావరకు కీలకపాత్ర వహిస్తూ వచ్చాడనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాలన్నీ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఉంటాయి. ఇక రామ్ తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) సినిమాతో పాన్ ఇండియా సినిమాను చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఆ తర్వాత చేసిన లైగర్(Liger), డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమాలతో కొంతవరకు డీలా పడ్డాడు. మరి ఈ సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. కాబట్టి తదుపరి సినిమాలతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటీ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఆయన కెరీర్ మొదట్లో చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇక ప్రస్తుతం సీనియర్ నటి అయిన రమాప్రభ కి పూరి ప్రతినెల 15 వేల రూపాయలను తన అకౌంట్లో వేస్తూ ఉంటారట. ఈ విషయాన్ని స్వయంగా రమాప్రభ గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం… ఆమెకి పూరి జగన్నాథ్ కి మధ్య అంత మంచి బాండింగ్ ఏర్పడడానికి గల కారణమేంటి అనే కొన్ని ప్రశ్నలు ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతూ ఉంటాయి.
Also Read : పూరీ,ఛార్మి చేతుల్లో మరో హీరో బలి..? ఫోటోకే వణికిపోతున్న ఫ్యాన్స్!
నిజానికి పూరి జగన్నాథ్ కెరీర్ మొదట్లో ఆయనకి ఆమె చాలా సపోర్ట్ గా ఉండేదట…పూరి జగన్నాథ్ సూపర్ స్టార్ కృష్ణ (Krishna) తో తన మొదటి సినిమాను స్టార్ట్ చేశాడు. ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత సినిమా క్యాన్సిల్ అయిపోవడంతో అప్పుడు పూరి జగన్నాథ్ కి చాలా హెల్ప్ చేస్తూ అతనికో స్పూర్తి నింపే మాటలైతే చెప్పిందట.
ప్రస్తుతం కృష్ణ గారితో నువ్వు సినిమా చేయలేకపోయిన కూడా ఫ్యూచర్లో తన కొడుకుతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ సాధిస్తావు కావచ్చు దాన్ని ఎవరు గెస్ చేయగలరు. నీలో మంచి టాలెంట్ ఉంది. ఒక సినిమా పోతే మరొక సినిమా వస్తుంది ఎందుకు డిప్రెషన్ లకి వెళ్తున్నావు అంటూ ఆమె చెప్పిన మాటలు ఆయనకు కెరియర్ మీద ఫోకస్ ని పెంచుకునేలా చేశాయాట.
అందుకే అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు రమప్రభ గారిని తన సినిమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ వస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఆమె వృద్ధాప్య దశలో ఉన్నందు వల్ల ఆమెకు ప్రతి నెల డబ్బులు కూడా పంపిస్తూ తనకి కృతజ్ఞత భావాన్ని చూపుకుంటూ వస్తున్నాడు.
Also Raed ; పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి కాంబోలో రానున్న సినిమా స్టోరీ ఇదేనా..?