https://oktelugu.com/

Pavithra Puri Biography : పూరి జగన్నాధ్ కూతురు  ఇప్పుడు ఏమి చేస్తోందో తెలుసా ?  

Pavithra Puri Biography : దర్శకుడు పూరి జగన్నాధ్ గారాల పట్టి,  పూరి తనయ ‘ప‌విత్ర‌’ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.  ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది. మరి పవిత్ర సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందా ? ఇంతకీ ‘పవిత్ర’  ప్రస్తుతం  ఏమి చేస్తోంది ?  ఇంతకీ,  ఆమె అభిరుచి ఏమిటి ?  అలాగే ఆమె  అభిప్రాయాలు ఏమిటో ? చూద్దాం. చిన్నతనంలో  నటన పై మక్కువ : చిన్న‌ప్పుడే బుజ్జిగాడు సినిమాలో చాలా ఈజీగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 6, 2022 / 07:59 AM IST
    Follow us on

    Pavithra Puri Biography : దర్శకుడు పూరి జగన్నాధ్ గారాల పట్టి,  పూరి తనయ ‘ప‌విత్ర‌’ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.  ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది. మరి పవిత్ర సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందా ? ఇంతకీ ‘పవిత్ర’  ప్రస్తుతం  ఏమి చేస్తోంది ?  ఇంతకీ,  ఆమె అభిరుచి ఏమిటి ?  అలాగే ఆమె  అభిప్రాయాలు ఏమిటో ? చూద్దాం.

    Pavithra  Puri

    చిన్నతనంలో  నటన పై మక్కువ :

    చిన్న‌ప్పుడే బుజ్జిగాడు సినిమాలో చాలా ఈజీగా నటించి ఆలరించింది ప‌విత్ర‌. ఆమెకు చిన్నతనంలో నటి కావాలనే కోరిక ఉండేది అట. అందుకే,  బాలనటిగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా  బుజ్జిగాడు సినిమాలోనే చిట్టి పాత్రలో  పవిత్ర  తన క్యూట్ నటనతో చాలా బాగా ఆకట్టుకుంది.

     

    ప్రస్తుతం పవిత్ర ఏమి చేస్తోంది ? 

    ఈ చిట్టి  ప్రస్తుతం పదహారణాల ఆడపడుచులా మారిపోయింది.  ఈ మధ్య  క్యూట్ లుక్స్ తో అదరగొట్టేలా ఫోటో షూట్స్ కూడా చేస్తోంది పవిత్ర.   అయితే  ఆమెకు నటన పై ఆసక్తి పోయిందట. అందుకే,   మ‌ళ్లీ ఎప్పుడూ న‌ట‌న జోలికి రాలేదు. గతంలో తనకు హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కావాలని ఉండేది అని..ఐతే, ప్రస్తుతానికి  నటనపై ఆసక్తి లేదు అంటూ  క్లారిటీ ఇచ్చింది పవిత్ర. ప్రస్తుతం ఆమె మాస్టర్ డిగ్రీ చేస్తోంది.  

     

     

    పవిత్ర భవిష్యత్తు ప్లాన్ ఇదే ! 

    భవిష్యత్తులో  మళ్లీ నటన జోలికి రాకపోయినా.. కచ్చితంగా ఇండస్ట్రీలోనే ఉంటాను అంటుంది పవిత్ర.   తనకు సినిమా నిర్మాణం అంటే చాలా ఇష్టమని.. అందుకే, ప్రొడక్షన్‌లో కి ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతుంది.  బాలయ్య  ‘పైసా వసూల్’ సినిమాతో  పాటు  ఆకాశ్ ‘రొమాంటిక్’ సినిమాకి కూడా పవిత్ర ప్రొడక్షన్ లో పని చేసింది. 

    ఎలాగూ  పూరి జగన్నాధ్  కాలక్రమేణా తన వైభవాన్ని కోల్పోతూ వస్తున్నాడు. ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉన్న పూరికి నిర్మాతలు దొరకని పరిస్థితి ఉంది. అందుకే, లైగర్ ను కూడా ఓన్ గానే  ప్రొడ్యూస్ చేస్తున్నాడు.  మరి కూతురే  భవిష్యత్తులో  నిర్మాతగా మారి పూరితో సినిమా చేస్తోందేమో చూడాలి.  అన్నట్టు 2023 లో పవిత్ర నిర్మాతగా మారనుంది.       

     

    పెళ్లి అయ్యాక,   దర్శకత్వం వైపు కూడా :

    బాలనటిగా పేరు తెచ్చుకున్నట్లుగానే  పవిత్ర ప్రస్తుతం దర్శకత్వం లో  కూడా తన ప్రతిభ చూపించాలని ఆశ పడుతుంది. అయితే,  పెళ్లి  అయ్యాక మాత్రమే, ఆమె భవిష్యత్తులో డైరెక్షన్ చేస్తోందట.  తనకు  దర్శకత్వం వహించాలని ఉందని, అందుకే..  తన తండ్రి దగ్గర పలు మెళుకువలు  కూడా  నేర్చుకుంటున్నాను అంటూ పవిత్ర ఆ మధ్య ఇచ్చిన  ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.   

     .