Puri Jagannadh: పూరి జగన్నాథ్(Puri Jagannadh)..ఒకప్పుడు ఈ డైరెక్టర్ ని రాజమౌళి లాంటి డైరెక్టర్స్ కూడా అందుకోలేకపోయేవారు. రాజమౌళి(SS Rajamouli) ఒక అద్భుతమైన సినిమా తీయడానికి రెండేళ్ల సమయం తీసుకుంటే, పూరి జగన్నాథ్ కేవలం రెండు మూడు నెలల్లో ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ సినిమాలను దింపేవాడు. ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం చూడడానికి టైం పాస్ లెక్క ఉంటుంది. హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయన సినిమాల్లోని డైలాగ్స్ గన్ నుండి విడుదలైన బుల్లెట్స్ లాగా ఉంటాయి. అందుకే పూరి జగన్నాథ్ కి హీరోలతో సమానమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఇదంతా గతం. కానీ ఇప్పుడు పూరి జగన్నాథ్ లో పస తగ్గిపోయింది. రైటింగ్ మీద గ్రిప్ పూర్తిగా పోయింది. ఒకప్పుడు పూరి జగన్నాథ్ ఎంత పెద్ద ఫ్లాప్ సినిమాని తీసినా, స్టార్ హీరోలు ఆయనకు డేట్స్ ఇవ్వడానికి ఏ మాత్రం వెనకడుగు వేసేవారు కాదు.
ఎందుకంటే ఆయన రైటింగ్ స్కిల్స్ మీద ఉన్న నమ్మకం అలాంటిది. కానీ ఎప్పుడైతే ఆయన హీరోయిన్ ఛార్మి(Charmy Kaur)తో జతకట్టాడో, అప్పటి నుండి ఆయన బ్యాడ్ టైం మొదలైంది. ఆమెతో కలిసి సినిమాలను నిర్మించడం మొదలు పెట్టి పదేళ్లు అయ్యింది. ఈ పదేళ్లలో కేవలం ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా తప్ప, మిగిలినవన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. పూరి జగన్నాథ్ అప్పులపాలై , బయ్యర్స్ చేత బూతులు తిట్టించుకునే పరిస్థితికి వచ్చాడు. ముఖ్యంగా ‘లైగర్’ సినిమాకి ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడో మనమంతా చూసాము. వాళ్లకు బయపడి విదేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లైగర్ తర్వాత విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’ అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కనీసం ప్రొమోషన్స్ కోసం చేసిన ఖర్చులు కూడా రాబట్టలేకపోయింది. ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమా అంటే కళ్ళు మూసుకొని టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లిపోయే జనం, ఇప్పుడు ఆయన సినిమా అంటేనే భయపడిపోతున్నారు.
అయితే ఇంత కష్టసమయం లో కూడా పూరి జగన్నాథ్ కి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) డేట్స్ ఇచ్చినట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక నుండి పూరి జగన్నాథ్ కేవలం దర్శకత్వం కి మాత్రమే పరిమితం అవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఇక మీదట ఛార్మి తో కలిసి సినీ నిర్మాణం లో భాగం కాకూడదని అనుకుంటున్నాడట. వాళ్ళిద్దరి పార్టనర్ షిప్ బ్రేక్ అయిపొయినట్టే. కాబట్టి నాగార్జున తో తీయబోయే సినిమా బాగా వస్తుందని, పూరి జగన్నాథ్ కం బ్యాక్ లోడింగ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రస్తుతం నాగార్జున మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది, పూరి జగన్నాథ్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ పై జనాలు ఆసక్తి చూపాలంటే కచ్చితంగా పాటల దగ్గర నుండే బ్లాక్ బస్టర్ ఫీల్డ్ ని రాబట్టాలి. అప్పుడే పూరి జగన్నాథ్ కం బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.