https://oktelugu.com/

Puri Jagannadh Latest Update: బిగ్ అప్ డేట్ కి ఇంకా 14:20 గంటల సమయం ఉంది !

Puri Jagannadh Latest Update: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. అందుకే, లైగర్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ పూరితోనే మరో సినిమా చేయాలని భావిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను వదిలారు మేకర్స్. మార్చి 29, 2022 […]

Written By:
  • Shiva
  • , Updated On : March 28, 2022 / 11:25 AM IST
    Follow us on

    Puri Jagannadh Latest Update: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. అందుకే, లైగర్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ పూరితోనే మరో సినిమా చేయాలని భావిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను వదిలారు మేకర్స్.

    Puri Jagannadh Latest Update

    మార్చి 29, 2022 అనగా రేపు ఈ చిత్రం కి సంబంధించిన ప్రకటన చేయనుంది. ప్రకటనకు ఇంకా 14:20 గంటల సమయం ఉంది అంటూ ఈ వార్తకు సంబంధించి టీమ్ ఓ ప్రకటనను విడుదల చేసింది టీమ్. గతంలో పూరీ జనగణమన పేరుతో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ హీరోగా నటించాల్సి ఉంది. కానీ ముందుకు పోలేదు. ఇప్పుడు అదే సినిమాను పూరీ, విజయ్‌తో చేయనున్నట్లు సమాచారం.

    నిజానికి విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ళ సమయాన్ని పూర్తిగా ‘లైగర్’ సినిమాకే కేటాయించాడు. మరో పక్క కరోనా ఒకటి. ఏది అయితే ఏం “లైగర్” సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. అలాగే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ కాలేదు. పూరి ఒక సినిమా కోసం ఈ స్థాయిలో ఎప్పుడూ సమయాన్ని కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ‘లైగర్’ 2022 ఆగస్టులో విడుదల కానుంది.

    Puri, Vijay

    విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కాగా విజయ్ కి సినిమా చాలా బాగా నచ్చిందట. సినిమా అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ధీమాగా ఉన్నాడు. అలాగే పూరితో కూడా విజయ్ చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. అందుకే, పూరి – విజయ్ దేవరకొండ కలయిక మరోసారి కుదిరింది.

    ఈ సినిమాకి కమిట్ అవ్వకముందు ‘లైగర్’ రఫ్ వెర్షన్ ను విజయ్ దేవరకొండ చూశాడట. పూరి సినిమాని తీసిన విధానం చాలా పర్ఫెక్ట్ గా ఉందట. అయితే, విజయ్ దేవరకొండ మైత్రి సంస్థకు ఒక సినిమా చేయాలి. ఆ సినిమాని శివ నిర్వాణం డైరెక్షన్ లో చెయ్యాలని మైత్రి ప్లాన్ చేసింది.

    Tags