ఆ మాటకొస్తే అసలు డిగ్రీ కూడా సరిగ్గా చదవని పూరికి, ఇన్ని విషయాలు ఎలా తెలుసు అబ్బా అని మనం కుళ్ళుకుంటాం. ఏది ఏమైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలంటే, ముందు ఆ వ్యక్తిలో విషయం ఉండాలి, పైగా చెప్పిన మ్యాటర్ అందరికీ అర్ధమయ్యేలా చెప్పగలిగాలి. పూరి పలికే ప్రతి మాట నగ్న సత్యంలా ఉంటుంది, పూరి చెప్పే ప్రతి విషయం జీవిత సత్యంలా ఉంటుంది. అందుకే పూరి ఐడియాలజీ సూపర్ హిట్ అయింది.
ఇక ఏదో ఒక టాపిక్ తీసుకుని దాని పై తనకున్న అభిప్రాయం ఏమిటో చాలా విపులంగా చెప్పడంలో కూడా పూరి సక్సెస్ అయ్యాడు. పూరి తాజాగా ధాన్యాలు గురించి, ముఖ్యంగా బియ్యంలోని అరుదైన రకం రాజముడి గురించి కొత్త విషయాలు చెప్పుకొచ్చాడు. పూరి మాటల్లోనే వింటే.. ‘ప్రెజెంట్ మన దేశంలో ఆరువేల రకాల ధాన్యాలు ఉన్నాయి.
అయితే, ఒకప్పుడు మన దేశంలో లక్ష రకాల ధాన్యాలుండేవి అని, వాటిన్నటిలో కల్లా రాజముడి అనేది అతి గొప్పదైన రకం అంటూ రాజముడి గురించి తెలియజేశాడు. రాజముడి రైస్ కర్ణాటకలో పుట్టిందని, దీనికి ఎంతో విలువ ఉండేదని, అయితే రాజుకు పన్ను కట్టని రైతులు రాజుకు ముడిగా బియ్యాన్ని ట్యాక్స్ లా కట్టేవారని, అందుకనే దానికి రాజముడి అనే పేరు వచ్చింది అంటూ పూరి తన మ్యూజింగ్ లో చెప్పుకొచ్చాడు. ఆ రాజముడి రైజ్ మ్యూజింగ్ మీకోసం….