Purandeswari Sensational Comments on Jr NTR: జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ని నందమూరి కుటుంబం చిన్నతనం లో దూరం పెట్టింది అనేది ఓపెన్ సీక్రెట్. ఎన్టీఆర్ అందరి పట్ల ఎంతో ఆప్యాతతో ఉంటాడు, నందమూరి కుటుంబం లో ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు రావడానికి ఆయన ఎప్పుడు ముందుంటాడు. అలాంటి ఎన్టీఆర్ ని మాత్రం మొదటి నుండి ఎందుకో నందమూరి కుటుంబ సభ్యులు తమ కుటుంబం లో కలుపుకోవడానికి ఇష్టపడలేదు. ఎప్పుడైతే ఆయనకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ స్టేటస్ వచ్చిందో, అప్పటి నుండి నెమ్మదిగా గుర్తించడం మొదలు పెట్టారంటూ ఎన్టీఆర్ అభిమానుకు చెప్తుంటారు. అయితే ఎన్టీఆర్ కూతురు, రాజమండ్రి ఎంపీ, బీజేపీ పార్టీ ముఖ్య నాయకురాలు పురందేశ్వరి(Daggubati Purandeswari) నేడు జరిగిన ఒక ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
చిన్నతనం లో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం దూరం పెట్టింది అనే రూమర్ ఉంది, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని అడగ్గా ‘చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి దూరం పెట్టడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చర్చలు జరపడం అనవసరం. ఒకప్పుడు దూరం ఉన్న విషయం మాత్రం వాస్తవమే. కానీ ఇప్పుడు అలా లేదు. అందరం కలిసిపోయాము’ అంటూ చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు స్వాగతిస్తారా అని అడిగిన ప్రశ్నకు పురందేశ్వరి సమాధానం చెప్తూ ‘అతనిది చాలా చిన్న వయస్సు. రాజకీయాల్లోకి రావాలా?, వద్దా అనేది పూర్తిగా అతని నిర్ణయం. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. క్షణం తీరిక లేదు. ఇలాంటి సమయంలో అతనికి రాజకీయాల గురించి ఆలోచించే స్పేస్ ఎక్కడుంది?, అతని మనసులో ఏముందో నాకు తెలియదు, ఈ అంశం గురించి మేమెప్పుడూ చర్చించుకోలేదు కూడా’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ తో నా పిల్లలు చాలా సన్నిహితంగా ఉంటారు. రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అతని సినిమా విడుదలకు దగ్గరగా ఉన్నప్పుడల్లా, భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను. ఎన్టీఆర్ నన్ను ఎంతో ఆప్యాయంగా అత్తా అని పిలుస్తాడు. తనతో నాకు మొదటి నుండి ఎలాంటి ఇబ్బందులు లేవు’ అంటూ చెప్పుకొచ్చింది పురందేశ్వరి. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ గత ఏడాది ‘దేవర’ చిత్రం తో మన ముందుకొచ్చి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆయన హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ‘వార్ 2 ‘ లో నటించాడు. ఈ ఏడాది అగష్టు 14 న ఈ చిత్రం విడుదల కాబోతుంది.