Puneeth Rajkumar: కన్నడ సూపర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ(భార్య అశ్విని తండ్రి) రేవనాథ్(78) గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణానంతరం రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్యం బారినపడ్డారు. ఈక్రమంలోనే గుండెపోటుకు గురికాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. పునీత్ కూడా గుండెపోటుతోనే మృతి చెందిన విషయం తెలిసిందే.

భర్త, తండ్రిని కోల్పోయిన అశ్విని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ సినిమా రిలీజ్ కి సిద్ధం అయ్యింది. కాగా ఈ సినిమాకు శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. తన సోదరుడి పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైందని శివరాజ్‌కుమార్ అన్నాడు. ‘డబ్బింగ్ చెప్పే సమయంలో స్క్రీన్ మీద నా సోదరుడు రాజ్‌కుమార్‌ను చూస్తుంటే నాకు మానసికంగా చాలా కష్టంగా అనిపించింది’ అని శివకుమార్ భావోద్వేగానికి గురి అయిన సంగతి తెలిసిందే.
Also Read: ‘భీమ్లా నాయక్’ టికెట్స్ బుకింగ్ షాకింగ్ నిర్ణయం
ఇక కన్నడ పవర్ స్టార్ గా పునీత్ రాజ్ కుమార్ ఎదిగి, తన తండ్రి రాజ్ కుమార్ కి నిజమైన వారసుడిగా కన్నడనాట గొప్ప స్టార్ డమ్ సంపాదించి.. పైగా ఎన్నో రకాలుగా సేవ చేసిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. ఏది ఏమైనా కన్నడ పవర్ స్టార్ గా మారడానికి పునీత్ జీవితం క్రమశిక్షణతో సాగింది. అందుకే, పునీత్ రాజ్‌కుమార్ కన్నడ ఇండస్ట్రీలోనే పవర్ స్టార్ గా నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు.

అన్నిటికి మించి కన్నడ ఇండస్ట్రీలో డ్యాన్స్ లను, ఫైట్స్ లను ఓ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత పునీత్ రాజ్ కుమార్ కే దక్కింది. పైగా పునీత్ పేరిట నాలుగు కన్నడ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. పైగా పునీత్ నటించిన అప్పు, నట సార్వభౌమ, మైత్రి, పవర్ ఈ నాలుగు చిత్రాలు కన్నడలో గొప్ప చిత్రాలుగా నిలిచిపోయాయి.
Also Read: కరోనా సోకిన వాళ్లకు మరో షాక్.. గుండెపై అలాంటి ప్రభావమట!