Prudhvi Raj : సీనియర్ నటుడు పృథ్విరాజ్… 30 ఇయర్స్ పృథ్విగా పాప్యులర్. ఓ మూవీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ, అని ఆయన చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్. పృథ్వి తరచుగా వార్తల్లో ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన్ని కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. ఇటీవల లైలా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పృథ్విరాజ్ చేసిన కామెంట్స్ వైసీపీ పార్టీ కార్యకర్తలను హర్ట్ చేశాయి. వారు పృథ్విరాజ్ ని ట్రోల్ చేశారు. లైలా మూవీని బాయ్ కాట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పృథ్వి వాళ్లకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
లైలా మూవీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే వీలు దొరికినప్పుడల్లా వైసీపీ నాయకులను పృథ్వి ఏకి పారేస్తూ ఉంటారు. చురకులు అంటిస్తారు. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియాకు పృథ్వి టార్గెట్ అయ్యాడు. తాజాగా ఆయన మీద సోషల్ మీడియాలో ఓ తప్పుడు ప్రచారం జరుగుతుంది. పృథ్వి మరణించాడు అంటూ శ్రద్ధాంజలి ఫోటో వైరల్ చేస్తున్నారు. ఈ విషయం పృథ్వి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. అది చేసిన వారి పై మండిపడ్డాడు.
Also Read : దిగొచ్చిన కమెడియన్ పృథ్వీ..వైసీపీ అభిమానులకు క్షమాపణ..పవన్ కళ్యాణ్ కోటింగ్ వల్లే ఇలా చేశాడా?
మీరు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? బ్రతికున్న మనిషిని చనిపోయాడని ప్రచారం చేస్తారా? మీ అమ్మ నాన్నల ఫోటోలను ఇలాగే వైరల్ చేయండి. మీ కంటే కుక్కే నయం, దానికి విశ్వాసం ఉంటుంది. వెధవల్లారా.. ఇది చేసిన వాళ్ళను వదలను, ఇంటికి నోటీసులు వస్తాయి. రెడీగా ఉండండి.. అని ఆయన వీడియో సందేశం విడుదల చేశాడు. ఆ పోస్ట్ క్రియేట్ చేసిన సోషల్ మీడియా ఐడీని పృథ్వి వీడియోలో ప్రస్తావించాడు.
గతంలో మాదిరి సోషల్ మీడియాలో సెలెబ్స్ మీద ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తామంటే కుదరదు. సైబర్ క్రైమ్ చట్టాలు కఠినతరం అయిన నేపథ్యంలో, అనుచిత చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదు. ఇక పృథ్వి నటుడిగా రాణిస్తూనే… ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. గతంలో ఆయన వైసీపీ పార్టీలో ఉండేవారు. ఎస్వీబీసీ చైర్మన్ గా ఆయనకు పదవి దక్కింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పదవి కోల్పోయాడు.
Also Read : నటుడు 30 ఇయర్స్ పృథ్వి పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు! ఆయన చేసిన తప్పేంటి?
సోషల్ మీడియాలో పోస్టు చూసి హర్ట్ అయిన జనసేన సీనియర్ నేత, హాస్య నటుడు పృథ్వీ. #SocialMedia #Janasena #Prudhviraj #UANow pic.twitter.com/KKtPGyGQcf
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) March 12, 2025