https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : రెచ్చగొట్టిన గౌతమ్.. రౌడీ లాగా ప్రవర్తించిన పృథ్వీ.. నా వెంట్రుక కూడా పీకలేవురా అంటూ అరుపులు!

ఈ వారం మెగా చీఫ్ టాస్కులోని మొదటి రౌండ్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తమ టీ షర్ట్స్ ని చిరిగిపోకుండా కాపాడుకోమని చెప్తాడు బిగ్ బాస్. అలా ఈ టాస్కులో పది మంది ఆడగా చివరికి యష్మీ, రోహిణి, టేస్టీ తేజ, పృథ్వీ, విష్ణు ప్రియా మెగా చీఫ్ కంటెండర్స్ గా నిలుస్తారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 / 08:22 AM IST

    Bigg Boss Telugu 8: Provoked Gautham.. Prithvi who behaved like a bully.. My hair is not combed!

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ వారం మెగా చీఫ్ టాస్కులోని మొదటి రౌండ్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తమ టీ షర్ట్స్ ని చిరిగిపోకుండా కాపాడుకోమని చెప్తాడు బిగ్ బాస్. అలా ఈ టాస్కులో పది మంది ఆడగా చివరికి యష్మీ, రోహిణి, టేస్టీ తేజ, పృథ్వీ, విష్ణు ప్రియా మెగా చీఫ్ కంటెండర్స్ గా నిలుస్తారు. అయితే రోహిణి ని చీఫ్ కంటెండర్ గా ఎంచుకునే ముందు నిఖిల్ కూడా ఒక ఛాయస్ గా మిగులుతాడు. బిగ్ బాస్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మెగా చీఫ్ కంటెండర్ గా నిలపాలని కోరగా, పృథ్వీ, విష్ణు, నబీల్ వచ్చి నిఖిల్ కి సపోర్టు చేయగా, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ రోహిణి కి సపోర్టు చేస్తారు. అయితే గౌతమ్ రోహిణి ని ఎంచుకునే ముందు కొన్ని పాయింట్స్ చెప్తారు. అది పెద్ద గొడవకి దారి తీసింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోపలకు వచ్చి, ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ నామినేట్ చేసేలా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ని డిజైన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

    అయితే హౌస్ లోపలకు వచ్చిన ఎలిమినేటడ్ కంటెస్టెంట్స్ ఇచ్చిన పాయింట్స్ లో ఓజీ క్లాన్ మొత్తం వైల్డ్ కార్డ్స్ ని నామినేట్ చేసి బయటకి పంపాలనే ప్లాన్ చేసిన విషయాన్ని పాయింట్స్ లో చెప్తారు ఎలిమినేటడ్ కంటెస్టెంట్స్. ఈ విషయాన్ని రోహిణి ని ఎంచుకునే క్రమంలో గౌతమ్ ప్రస్తావిస్తూ ఇలా రాయల్ క్లాన్ కి అన్యాయం చేయాలని చూసారు కాబట్టి నేను రోహిణి కి సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా అని అంటాడు గౌతమ్. దీనిని పృథ్వీ వ్యతిరేకిస్తూ ‘ప్రారంభం బిగ్ బాస్ మాకు వైల్డ్ కార్డ్స్ ని శత్రువులు, సునామి లెక్క చెప్పి మమ్మల్ని భయపెట్టారు. ఆ సమయంలో మేము రాయల్ క్లాన్ ని శత్రువులుగా భావించి నామినేట్ చేసి బయటకి పంపాలని అనుకున్న విషయం వాస్తవమే, కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ క్లాన్స్ ని పీకేశాడో, అప్పటి నుండి అందరిని ఒకేలా చూస్తున్నాం’ అని అంటాడు పృథ్వీ.

    అయితే ఇక్కడితో వదిలేయకుండా గౌతమ్ వీళ్లంతా మొదటి నుండి గ్రూప్ గేమ్ ఆడిన సందర్భాలను వివరిస్తుంటాడు. ఇక్కడి నుండి గొడవ మెల్లిగా పెద్దది అవుతూ ఉంటుంది. గ్రూప్ గేమ్ అని అంటున్నావ్ కదా, ఇందాక నిఖిల్ టీ షర్ట్ ని కాపాడడానికి నేనేమి రాలేదు కదా, ఎలా గ్రూప్ గేమ్ అంటావ్ అని మొదలు పెడుతాడు పృథ్వీ. అతను మాట్లాడే తీరు కి గౌతమ్ కి కూడా కోపం వస్తుంది. ఇద్దరు పెద్దగా అరుచుకుంటారు. పృథ్వీ గౌతమ్ వైపు చూస్తూ ‘వాడికి స్కోప్ ఇచ్చేది ఏంట్రా’ అని నబీల్ తో అంటాడు. అప్పుడు గౌతమ్ ‘మర్యాదగా మాట్లాడు..వాడు వీడు అనకు’ అని అంటాడు. అలా వీళ్లిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటుంది. పృథ్వీ తన చాతి మీదున్న వెంట్రుకలు పీకి, నువ్వు ఇది కూడా పీకలేవు అని అంటాడు. మొత్తం మీద రెచ్చిపోయిన పృథ్వీ ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తించాడు.