Bigg Boss Telugu 8 : ఈ సీజన్ లో మొదటి నుండి గేమ్స్ అద్భుతంగా ఆడుతూ వస్తూ, టాస్కుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆడిన పృథ్వీ మెగా చీఫ్ అయితే చూడాలని చాలా మంది కోరుకున్నారు. ఈ వారం కూడా ఆయన మెగా చీఫ్ టాస్కులను అద్భుతంగా ఆడాడు. కానీ చివరికి ఆయన మెగా చీఫ్ అవ్వలేకపోయాడు. ఆయనకీ బదులుగా రోహిణి మెగా చీఫ్ అయ్యింది. బాగా గమనించి చూస్తే రోహిణి ఈ సీజన్ కేవలం ఒకటి రెండు మినహా పెద్దగా టాస్కులు ఆడడం ని మనం ఎవ్వరూ చూడలేదు. కానీ బిగ్ బాస్ ఎందుకో రోహిణి, అవినాష్ ని ఉద్దేశపూర్వకంగా సేవ్ చేస్తున్నట్టు ఆడియన్స్ కి అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్లిద్దరు మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇస్తున్నారు, వీళ్లిద్దరి కారణంగా టీఆర్ఫీ రేటింగ్స్ బాగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళని చివరి వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్.
రోప్స్ ని పట్టుకొని వేలాడే టాస్కులో యష్మీ, పృథ్వీ నిజంగా అద్భుతంగా ఆడారు. పృథ్వీ అంటే మంచి బలమున్న వ్యక్తి కాబట్టి అంతసేపు రోప్స్ ని పట్టుకొని వేలాడాడు, కానీ యష్మీ లో అంత బలం లేదు, రోప్స్ ని గట్టిగా పట్టుకుంటే చేతులు తెగిపోయి రక్తం కారే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆమె చాలా బలంగా నిలబడి కసితో ఆడింది. ఎందుకంటే ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఎలాంటి గ్రూప్ గేమ్స్ ఆడకుండా, తన సొంతంగా ఆటలు ఆడి ఆడపులి అని మరోసారి నిరూపించుకుంది. ఈ ఎపిసోడ్ ద్వారా ఆమెకి లెక్క ప్రకారం ఓట్లు బాగా పడాలి, నామినేషన్స్ నుండి సేవ్ అవ్వాలి. కానీ నిఖిల్ విషయం లో యష్మీ బయట చాలా నెగటివ్ అయ్యింది. కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యేందుకే ఇప్పటికీ ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే రోహిణి కి ఉన్న పని చేసే గుణం వల్ల మెగా చీఫ్ అవ్వడం సంతోషమే కానీ, మొదటి నుండి కష్టపడిన పృథ్వీ మెగా చీఫ్ అవ్వకపోవడం కాస్త బాధాకరమే. ఇది ఆయనకీ సానుభూతి ఓట్లను తీసుకొని రావొచ్చు. అదే విధంగా ఆయన గౌతమ్ తో పడిన గొడవ కూడా నెగటివ్ అతనికి ఓటింగ్ లో దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి యష్మీ తో పాటు, పృథ్వీ కూడా సమానమైన ఓట్లతో డేంజర్ జోన్ లో ఉండే అవకాశం లేకపోలేదు. వచ్చే వారం రాయల్ క్లాన్ లో గౌతమ్, లేకపోతే రాయల్ లో మిగిలిన వేరే ఎవరైనా నామినేషన్స్ లోకి వస్తే రోహిణి కి బిగ్ బాస్ సేవ్ చేసే పవర్ ఇచ్చినప్పుడు ఆమె అవినాష్, లేదా టేస్టీ తేజ ని సేవ్ చేసే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తే రాయల్ క్లాన్ వాళ్ళు ఫినాలే వీక్ కి వెళ్ళిపోబోతున్నారు అన్నమాట.