https://oktelugu.com/

‘Project K’ Remunerations : ‘ప్రాజెక్ట్ కే’ రెమ్యూనరేషన్స్.. వాళ్ళకే రూ.200 కోట్లు

ప్రభాస్ రూ. 150 కోట్లు తీసుకుంటున్నారు. చిత్ర బడ్జెట్ లో ఆయన రెమ్యూనరేషన్ సింహభాగంగా ఉంది. నెక్స్ట్ కమల్ హాసన్ కి రూ. 20 కోట్లు ఇస్తున్నారట. కమల్ ఇమేజ్ కి ఇది చాలా తక్కువ. కానీ ఆయన పాత్ర నిడివి రీత్యా రూ. 20 కోట్లు చాలా ఎక్కువ.

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2023 / 07:33 PM IST
    Follow us on

    ‘Project K’ Remunerations : ప్రాజెక్ట్ కే మూవీపై వస్తున్న ఒక్కో అప్డేట్ అంచనాలు పెంచేస్తుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్ కీలక రోల్ చేస్తుండగా దిశా పటాని మరొక హీరోయిన్ గా నటిస్తుంది. సడన్ గా కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చారు. నిన్న అధికారికంగా కమల్ హాసన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ప్రాజెక్ట్ కే లో కమల్ హాసన్ భాగం కావడం ఊహించని పరిణామం. సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ కే స్టార్స్ రెమ్యూనరేషన్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

    ప్రాజెక్ట్ కే లో భాగమైన వారందరూ తమ తమ కేటగిరీల్లో టాప్ స్టార్స్. ప్రభాస్ దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరో కాగా దీపికా పదుకొనె అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఉన్నారు. ఇక అమితాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్. దిశా పటాని సైతం తక్కువేమీ కాదు. ఇక కమల్ హాసన్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే.

    ఈ ఐదుగురి రెమ్యూనరేషన్స్ పరిశీలిస్తే.. ప్రభాస్ రూ. 150 కోట్లు తీసుకుంటున్నారు. చిత్ర బడ్జెట్ లో ఆయన రెమ్యూనరేషన్ సింహభాగంగా ఉంది. నెక్స్ట్ కమల్ హాసన్ కి రూ. 20 కోట్లు ఇస్తున్నారట. కమల్ ఇమేజ్ కి ఇది చాలా తక్కువ. కానీ ఆయన పాత్ర నిడివి రీత్యా రూ. 20 కోట్లు చాలా ఎక్కువ. ప్రాజెక్ట్ కే షూటింగ్ చివరి దశలో ఉంది. కాబట్టి ఆయనది జస్ట్ క్యామియో రోల్ కావచ్చని పలువురి అభిప్రాయం.

    నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ రూ. 15 కోట్లు తీసుకుంటున్నారట. దీపికా పదుకొనె రూ. 15 కోట్లు, దిశా పటాని రూ. 5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారని సమాచారం. మొత్తంగా ఈ ఐదుగురు రూ. 200 కోట్లు తీసుకుంటున్నారు. సినిమా బడ్జెట్ రూ. 600 కోట్లు. మిగతా రూ. 400 కోట్లు మేకింగ్ కి కేటాయించారట. ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతుంది. అలాగే లార్డ్ కృష్ణ ప్రస్తావన ఉంటుందట. ప్రాజెక్ట్ కే అనగా ప్రాజెక్ట్ కృష్ణ అని అర్థం అంటున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.