Pawan Kalyan: ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలలో అభిమానులతో ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘ఓజీ’. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా, #RRR మూవీ మేకర్స్ దీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించిన రోజు నుండే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత రీమేక్స్ ని పక్కన పెట్టి, ఒక డైరెక్ట్ సబ్జెక్టు తో, అది కూడా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ జానర్ లో సినిమా తీస్తుండడంతో అభిమానులు పిచ్చెక్కిపోయారు. కచ్చితంగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టిస్తుందని బలంగా నమ్మారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కదా అసలు సిసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటే. ఎలాంటి సినిమాలో అయితే ఆయన్ని చూడాలని అభిమానులు ఇంత కాలం కోరుకున్నారో, అలాంటి సినిమా చేస్తుండడంతో వాళ్ళ ఆనాడు హద్దులే లేకుండా పోయింది. ఓజీ అనే పేరు తీస్తే చాలు, మన చుట్టూ ఉండే వాతావరణం చాలా వైల్డ్ గా మారిపోతుంది. ఎంత వైల్డ్ గా అంటే పవన్ కళ్యాణ్ కూడా చిరాకు పడేలా. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా అభిమానులు ‘ఓజీ..ఓజీ’ అని నినాదాలు చేస్తున్నారు. నిన్న ఒక ప్రభుత్వ అధికారి పై దాడి జరిగి, అతను హాస్పిటల్ లో ఉన్నాడని తెలుసుకొని,అక్కడికి వెళ్లి పరామర్శించడానికి వెళ్తే అక్కడ కూడా అభిమానులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు ‘ఓజీ..ఓజీ’ అని అరుస్తారు.
దీనికి పవన్ కళ్యాణ్ చాలా చిరాకు పడుతాడు. ఎక్కడ ఏమి స్లోగన్ ఇవ్వాలో తెలియదా మీకు అని అంటాడు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. అది నిర్మాతల వరకు చేరడంతో వాళ్ళు నిన్న రాత్రి ట్విట్టర్ లో స్పందించారు. ఈమేరకు ఒక లేఖని విడుదల చేస్తూ ‘ఓజీ చిత్రానికి ఇంత క్రేజ్ దక్కడం మా అదృష్టం గా భావిస్తున్నాం. మీ అభిమానం ని అర్థం చేసుకోగలం. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి. జనల శ్రేయస్సు కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇలా సందర్భం లేకుండా ఓజీ ఓజీ అని పబ్లిక్ ప్రాంతాల్లో అరిచి ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. కొత్త సంవత్సరం లో ఓజీ ని ఒక పండుగలాగా జరుపుకుందాం. అప్పటి వరకు సమన్వయం పాటించండి’ అంటూ చెప్పుకొచ్చారు.