Homeఎంటర్టైన్మెంట్AR Rahman: టాలీవుడ్ లో తమన్ శకం ఇక ముగిసినట్టేనా..? AR రెహమాన్ కోసం క్యూలు...

AR Rahman: టాలీవుడ్ లో తమన్ శకం ఇక ముగిసినట్టేనా..? AR రెహమాన్ కోసం క్యూలు కడుతున్న నిర్మాతలు!

AR Rahman: మన టాలీవుడ్ లోనే కాదు, ఏ ఇండస్ట్రీ లో అయినా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎల్లప్పుడూ చార్ట్ బస్టర్ సాంగ్స్ ని అందిస్తూనే ఉండాలి. ఒకటి రెండు సినిమాలు తేడా కొట్టినా కెరీర్ రిస్క్ లో పడే అవకాశం ఉంది. వాళ్ళకంటే మార్కెట్ లో మంచి మ్యూజిక్ ని అందించే మ్యూజిక్ డైరెక్టర్ దొరికితే చాలు, అందరూ అటు వైపు వెళ్ళిపోతారు. గతం లో తమన్(SS Thaman), దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కారణంగా, మని శర్మ లాంటి లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ కి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఏ రోజైనా తమన్, దేవి శ్రీ ప్రసాద్ లాంటి వాళ్లకు కూడా అలాంటి రోజు రాకుండా ఉండదు అని అప్పుడే విశ్లేషకులు అంచనా వేశారు. దేవిశ్రీ ప్రసాద్ క్రేజ్ ఈమధ్య కాలం లో బాగా తగ్గిపోయింది. ‘పుష్ప 2’ లాంటి సెన్సేషనల్ మ్యూజిక్ ని అందించినప్పటికీ కూడా మేకర్స్ కొత్తగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యంగ్ టాలెంట్ వైపే మొగ్గు చూపిస్తున్నారు.

ఇక మన టాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో ప్రస్తుతం తమన్ మేనియా కొనసాగుతోంది. గత ఏడాది ఈయన సంగీత దర్శకత్వం వహించిన ‘ఓజీ’ చిత్రం లోని పాటలు, అందులోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఆ తర్వాత విడుదలైన ‘అఖండ 2’ తో తమన్ కాస్త నిరాశపరిచాడు. ఇక ‘రాజా సాబ్’ చిత్రానికి ఆయన కంపోజ్ చేసిన పాటల్లో ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈసారి వర్కౌట్ అవ్వలేదు. దీంతో తమన్ చాలా రొటీన్ అయిపోయాడని, ఆయన పాటల్లోని మ్యూజిక్ లో సరిగా మిక్సింగ్ జరగడం లేదని. వోకల్స్ ని మ్యూజిక్ బీట్ చేస్తుందని, ఇలా సోషల్ మీడియా లో ఎన్నో విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది.

దీంతో తమన్ కి కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆయన చేతుల్లో ఉన్న సినిమాలు మినహా, కొత్తవి ఒప్పుకోలేదు. నిర్మాతలు కూడా ఆయన వైపు చూడడం లేదు. ప్రస్తుతం నిర్మాతల చూపు మొత్తం AR రెహమాన్(AR Rahman) మీదనే ఉంది. రీసెంట్ గా ఆయన కంపోజ్ చేసిన ‘చికిరి చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా ‘పెద్ది’ చిత్రం లోని మిగిలిన పాటలన్నీ కూడా ఒకదానిని మించి ఒకటి లాగ ఉన్నాయని, నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా AR రెహమాన్ తనని తానూ మార్చుకున్నాడని నిర్మాతలు బలంగా నమ్మడంతో, ఇప్పుడు ఇంటి చుట్టూ టాప్ నిర్మాతలు ప్రదిక్షణలు చేస్తున్నారట. ఇక రాబోయే రోజుల్లో రెహమాన్ మేనియా ని నేటి తరం యువత చూడబోతుంది అన్నమాట. ఇప్పటికే రెండు పెద్ద సినిమాలకు సంతకం చేశాడు రెహమాన్. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సినిమాలకు సంతకం చేయబోతున్నాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular