ఒకటి రెండు హిట్లు ఉన్న హీరోలకు కూడా వరుసగా అడ్వాన్స్ లు ఇస్తారు నిర్మాతలు. అంతెందుకు ఏజ్ అయిపోయినా రవితేజ వెనుక కూడా, ఇప్పుడు నిర్మాతలు వెంటపడుతున్నారు. కానీ, బాలయ్య బాబుకు నిర్మాత దొరకడం లేదు. అసలు బాలయ్య పేరు వింటేనే యాక్షన్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్స్ గుర్తుకువస్తాయి. జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ పలికే కేకలు వినపడతాయి. అయితే అదంతా గతం, ప్రస్తుతం నిర్మాత లేక కొత్త సినిమాని మొదలుపెట్టలేక బాలయ్య లోలోపలే కుంగిపోతున్న పడుతున్నట్లు తెలుస్తోంది.
పోనీ సొంత బ్యానర్ లోనైనా సినిమా చేద్దామా అంటే.. ఎన్టీఆర్ బయోపిక్ దెబ్బకు బాలయ్యకు భారీ నష్టాలు వచ్చాయి. దాంతో సొంత సినిమా అంటేనే బాలయ్య భయపడుతున్నాడు. ఇంతకీ కొత్త సినిమా డైరెక్టర్ ఎవరు ? కథ ఏమిటి ? అంటే.. డాషింగ్ డైరెక్టర్ పూరి, బాలయ్య బాబు కోసం ఓ డిఫరెంట్ కథ రాశాడు. పల్నాటి ప్రాంతానికి చెందిన బ్రహ్మనాయుడు కాలం నాటి కథ అన్నమాట అది. అప్పటి రాజు పొరపాటున ఈ భూమి మీదకు వచ్చి.. ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, తన రాజరికం వల్ల ఎలాంటి సమస్యలు అనుభవించాడు ? ఈ మధ్యలో భర్త పోయిన ఓ మహిళతో ఎలా ప్రేమలో పడ్డాడు ? ఆమె ప్రేమ కోసం ఈ రాజుగారు ఏమి చేశాడు ? అనేది సినిమా లైన్.
లైన్ సింపుల్ గా ఉన్నా.. సీన్స్ మాత్రం భారీగా ఉంటాయట. ఎక్కువుగా గ్రాఫిక్స్ ఉంటాయట. పైగా కథలో సగం భారీ యాక్షన్ ఉంటుందట. అందుకే, బడ్జెట్ బాలయ్య మార్కెట్ కంటే ఎక్కువ అని తెలుస్తోంది. దాంతో ఏ నిర్మాత ముందుకు రావడం లేదు. ఓ దశలో సి కళ్యాణ్ ముందుకు వచ్చినా.. ఆ తరువాత మళ్ళీ కళ్యాణ్ కూడా తప్పుకున్నాడు. పోనీ కథ మారుద్దామా అని పూరి అంటే.. కథ బాలయ్యకు బాగా నచ్చింది. అందుకే నిర్మాతను తెచ్చే పని బాలయ్యే చూసుకుంటున్నాడు.
ఈ క్రమంలో అందరికీ ఫోన్ చేసి.. ఆరా తీస్తున్నాడట. బాలయ్య ఇన్ డైరెక్ట్ గా మీకు డేట్స్ ఇస్తాను అని చెప్పినా ఏ నిర్మాత రియాక్ట్ అవ్వడం లేడట. పాపం బాలయ్య. బాలయ్య – పూరి కాంబినేషన్లో గతంలో ‘పైసా వసూల్’ అనే ప్లాప్ చిత్రం వచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని కాదు కదా, కనీస విజయాన్ని కూడా అందుకోలేక భారీ నష్టాలు మిగిల్చింది. అయితే, బాలయ్య నటన మాత్రం సినిమాలో కొత్తగా ఉందనే ప్రశంసలు అందాయి. కాకపోతే, రెగ్యులర్ ప్రేక్షకులకు ఆ నటన కూడా నచ్చలేదు. అందుకే ఏ నిర్మాత ఈ కాంబినేషన్ పై భారీగా ఖర్చు పెట్టడానికి ముందుకు రావడం లేదు.