https://oktelugu.com/

హీరో రామ్ స్ట్రామినా పెరిగింది.. నిర్మాతల్లో ఏంటీ మార్పు?

ఎనర్జిటిక్ స్టార్ గా హీరో రామ్ కు టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. తొలినాళ్లలో మాస్ ప్రేక్షకులను అలరించేలా సినిమాలు చేసిన రామ్ ఆ తర్వాత లవర్ బాయ్ గా మారిపోయాడు. పక్కింటి కుర్రాడి కన్పించే రామ్ అటూ ఫ్యామిలీ.. ఇటూ మాస్.. క్లాస్ ప్రేక్షకులను అలరించేలా సినిమాలు చేస్తూ ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ స్టార్ గా మారిపోయాడు. Also Read: మెగాస్టార్ కు ఏమైంది.. ఇలా ఆలోచిస్తున్నాడు? ఇటీవలే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ‘ఇస్మార్ట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 01:41 PM IST
    Follow us on

    ఎనర్జిటిక్ స్టార్ గా హీరో రామ్ కు టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. తొలినాళ్లలో మాస్ ప్రేక్షకులను అలరించేలా సినిమాలు చేసిన రామ్ ఆ తర్వాత లవర్ బాయ్ గా మారిపోయాడు. పక్కింటి కుర్రాడి కన్పించే రామ్ అటూ ఫ్యామిలీ.. ఇటూ మాస్.. క్లాస్ ప్రేక్షకులను అలరించేలా సినిమాలు చేస్తూ ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ స్టార్ గా మారిపోయాడు.

    Also Read: మెగాస్టార్ కు ఏమైంది.. ఇలా ఆలోచిస్తున్నాడు?

    ఇటీవలే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. త్వరలోనే ఈ మూవీ సీక్వెల్ కూడా రాబోతుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ తర్వాత రామ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అదేవిధంగా రామ్ తాజాగా నటించిన ‘రెడ్’ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకొని మంచి బిజినెస్ చేసింది.

    రామ్ మార్కెట్ భారీగా పెరగడంతో నిర్మాతలు సైతం భారీ బడ్జెట్లో సినిమాలు తీసేందుకు ముందుకొస్తున్నారు. గతంలో బడ్జెట్ కారణంగా ఆగిపోయిన రామ్ మూవీ తాజాగా పట్టాలెక్కబోతుంది. ‘గరుడవేగ’ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో రామ్ ఓ మూవీ చేయనున్నట్లు గతంలోనే ప్రకటన వచ్చింది. స్రవంతి రవికిషోర్ ఈ మూవీని నిర్మించేందుకు ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు.

    ‘గరుడవేగ’ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓవర్ బడ్జెట్ కారణంగా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక రామ్ తో చేయబోయే యాక్షన్ థ్రిల్లర్ మూవీకి కూడా ప్రవీణ్ సత్తా భారీ బడ్జెట్ లెక్కలు వేసుకున్నాడు. దీంతో ఇది వర్కౌట్ కాదని నిర్మాత రవి కిషోర్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాడు. అయితే రెండుళ్లుగా ప్రవీన్ సత్తారు వేరే సినిమాల కోసం ట్రై చేసిన ఏది వర్కౌట్ కాలేదు.

    Also Read: నిహారిక పెళ్లి పనులు షూరు.. ఆ మెగా హీరోదే పెత్తనం?

    ప్రస్తుతం రామ్ మార్కెట్ బాగా పెరిగిపోవడంతో తిరిగి ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రామ్ గత చిత్రాలు ‘ఇస్మార్ట్ శంకర్’.. ‘రెడ్’ మూవీలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు మంచి బిజినెస్ చేశాయి. దీంతో నిర్మాత స్రవంతి రవికిషోర్ హీరో రామ్ పై భారీ బడ్జెట్ పెట్టేందుకు ముందుకొచ్చారు. దీంతో ప్రవీణ్ సత్తారు-రామ్ కాంబోలో గతంలో ఆగిపోయిన మూవీ మళ్లీ పట్టాలెక్కబోతుంది.