Allu Arjun : ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే కాకుండా భారీ విజయాలను కూడా నమోదు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు… మరి ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో మన హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతుండడం విశేషమనే చెప్పాలి… ఒక సినిమాను మించి మరొక సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ ఇండియన్ ఇండస్ట్రీ తలరాతను మారుస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. అందులో అల్లు అర్జున్ ఇప్పుడు భారీ క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆయన లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా సూపర్ సక్సెస్ లు అవ్వడంతో స్టార్ హీరోగా అవతరించి ఆయనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా పెను ప్రభంజనాలను సృష్టిస్తుంది. ఇక దానికి తోడుగా ఈ సంవత్సరం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడనే చెప్పాలి… ఇక పుష్ప 2 సినిమా కోసం ఏకంగా 300 కోట్ల రెమ్యూనిరేషన్ ను తీసుకొని ఇండియాలో ఎవరికీ సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు… ఇక ఇప్పటివరకు అంత రెమ్యూనరేషన్ ను తీసుకున్న హీరో మరవరు లేరనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక తన తర్వాత సినిమా కోసం 400 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పుష్ప 2 భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. ఇక ఇప్పటికే 1800 కోట్ల కలెక్షన్స్ తో మంచి ఊపు మీదున్న ఈ సినిమా లాంగ్ రన్ లో 2000 కోట్ల కలెక్షన్లను రాబట్టడం పెద్ద విషయమైతే కాదు.
కాబట్టి తన తర్వాత సినిమాకి 400 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చిన ప్రాబ్లం లేదు అంటూ తన తర్వాత సినిమా ప్రొడ్యూసర్లు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక బాలీవుడ్ యశ్ రాజ్ ప్రొడక్షన్ వాళ్లైతే మాకు ఒక సినిమా చేయమని ఆయనకి బ్లాంక్ చెక్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది…మరి ఈ విషయంలో ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకొనట్టుగా తెలుస్తోంది…
ఇక ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్న ఈ స్టార్ హీరో ఒకేసారి టాప్ పొజిషన్ కి చేరుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకోవడం లో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడు…