Producer Vishwa Prasad The Raja Saab: ప్రభాస్(Rebel star Prabhas), మారుతీ(Director Maruthi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. 90 శాతం కి పైగా సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది, కానీ పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది. ఈ పాటల చిత్రీకరణ రీసెంట్ గానే మొదలైంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా మనం సోషల్ మీడియా లో చాలానే లీక్ అవ్వడం చూశాము. ప్రభాస్ ఈ ఫోటోలలో ఊర మాస్ లుక్ లో కనిపించడం విశేషం. అభిమానులు అప్పుడెప్పుడో మిర్చి, బుజ్జిగాడు సమయం లో ఇలా చూసి ఉంటారు ప్రభాస్ ని. అందుకే ఈ చిత్రం పై ఫ్యాన్స్ లోనే కాకుండా ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్ కి, థియేట్రికల్ ట్రైలర్ కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు ఆ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్.
ఆయన మాట్లాడుతూ ‘మా సినిమా ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సింది ఉంది. కానీ VFX మ్యానేజర్ సరిగా పనిచేయలేదు. నాసిరకమైన VFX షాట్స్ ని అందించారు. అవి డైరెక్టర్ కి అసలు నచ్చలేదు. ఇదేంటి అని నిలదీస్తే అతను డైరెక్టర్ నే బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో మేము VFX మ్యానేజర్ ని మార్చడం జరిగింది. అందుకే ఏప్రిల్ లో రావాల్సిన సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఏప్రిల్ సమయం లో సినిమా VFX భాగం అసలు పూర్తి అవ్వలేదు అన్నమాట. అయితే ట్రైలర్లోని VFX షాట్స్ కూడా అనుకున్నంత గొప్పగా రాలేదు. సినిమా ఫైనల్ కాపీ సిద్ధం అయ్యేలోపు గ్రాఫిక్స్ వర్క్ బాగా ఉంటుందని ఆశిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఈ సినిమా ఆడియన్స్ ని ఎంత మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ దీపావళి నుండి నాన్ స్టాప్ అప్డేట్స్ ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
