Producer Vishwa Prasad: టాలీవుడ్ లో రీసెంట్ గా ఆకాశం నుండి ఊడిపడినట్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే సంస్థ నెలకు ఒక సినిమాని విడుదల చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. రీసెంట్ గా ఆయన టీ సిరీస్ అనే సంస్థ నుండి ‘ఆదిపురుష్’ మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసి ఈనెల 16 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ ఏ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా అనాధ పిల్లల కోసం టిక్కెట్లు ఉచితంగా పంచుతూ అందరీ దృష్టిని ఆకర్షించారు. ప్రభాస్ కి అత్యంత సన్నిహితంగా ఉండే సెలెబ్రిటీలు కూడా తమ వంతు సహాయం గా అనాధ పిల్లలకు ఒక్కొక్కరు పది వేల టికెట్స్ ని కొనుగోలు చేసారు. అలా ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి లక్ష టిక్కెట్లు ఉచితంగా అనాధ పిల్లలకు అందిస్తున్నారని తెలుస్తుంది.
మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం తో ఆ చిత్ర నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మీడియా తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు మరియు ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు. మీరు ఇప్పుడు ప్రభాస్ తో ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు. ఆ చొరవతోనే ఆదిపురుష్ సినిమాని కొన్నారా?, అని ఒక విలేకరుడు ప్రశ్నించగా, దానికి విశ్వ ప్రసాద్ సమాధానం చెప్తూ ‘మేము ఈ సినిమాని ప్రభాస్ ని చూసి కొనలేదు. ట్రైలర్ చూసిన తర్వాత ఎందుకో మాకు చాలా ప్రామిసింగ్ సినిమా అనిపించింది. జనాల్లో కూడా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ని గమనించాము. అందుకే ఈ సినిమాని కొన్నాము, కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే నమ్మకం ఉంది’ అని చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మిమల్ని ఆయన కుటుంబ సభ్యులు లాగ చెప్పుకొచ్చాడు, ‘ఆదిపురుష్’ సినిమాని కొనేముందు మీరు ప్రభాస్ ని సంప్రదించారా? అని అడగగా దానికి విశ్వప్రసాద్ సమాధానం ఇస్తూ ‘ప్రభాస్ మాకు కుటుంబ సభ్యునితో సమానమే, కానీ ఆదిపురుష్ కొనే ముందు ఆయనని సంప్రదించలేదు, నేరుగా టీ సిరీస్ ని సంప్రదించే కొన్నాము. రేపు ప్రభాస్ – సందీప్ వంగ కాంబినేషన్ లో రాబోతున్న ‘స్పిరిట్’ ని కూడా మేమే కొనబోతున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు.