Vishwa Prasad
Vishwa Prasad : గత ఏడాది ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ'(People’s Media Factory) సంస్థ ఎలాంటి ఆర్ధిక సంక్షోభం ని ఎదురుకుండా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చేసిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒక ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఆ సంస్థ నిర్మాత టీజీ విశ్వప్రసాద్(TG Viswaprasad) పెద్ద పారిశ్రామిక వేత్త, అంతే కాకుండా అతనికి ఎన్నో ఐటీ కంపెనీలు ఉన్నాయి, విదేశాల్లో కూడా బోలెడంత వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఆయన స్థానంలో మరో నిర్మాత ఉండుంటే సినిమాల జోలికి కన్నెత్తి కూడా చూసేవారు కాదు. గత ఏడాది ఆయన మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand), శ్రీను వైట్ల(Srinu Vaitla) కాంబినేషన్ లో ‘విశ్వం’ అనే చిత్రాన్ని నిర్మించాడు. దసరా పుణ్యమా అని ఈ చిత్రం యావరేజ్ రేంజ్ లో వసూళ్లను రాబట్టి పర్వాలేదు అని అనిపించింది. కానీ నిర్మాత విశ్వ ప్రసాద్ కి మాత్రం ఓటీటీ రూపం లో బాగానే లాభాలు వచ్చాయి కానీ, తన సహనిర్మాతలకు మాత్రం అందులో పైసా ఇవ్వలేదు.
ఈ చిత్రాన్ని కేవలం విశ్వ ప్రసాద్ ఒక్కడే నిర్మించలేదు. ఆయనతో పాటుగా వేణు దోనేపూడి, ప్రభాకర్ వంటి వారు కూడా నిర్మాణం పాలు పంచుకున్నారు. కానీ పెత్తనం మొత్తం విశ్వ ప్రసాద్ దే ఉండేది. ఎంత పెత్తనం తీసుకుంటే మనకెందుకు, లాభాల్లో వాటాలు ఇస్తే చాలు అని అనుకున్నారు వేణు, ప్రభాకర్. ఒప్పందం కూడా ఈ సినిమాకి సంబంధించి అన్ని లాభాల్లోనూ తమకు వాటా ఉందని సంతకం చేసుకున్నారు. థియేటర్స్ లో విడుదలై యావరేజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి, ఓటీటీ లో మాత్రం భారీగానే లాభాలు వచ్చాయి. అదే విధంగా సాటిలైట్ రైట్స్ కూడా మంచి రేట్ కి అమ్ముడుపోయింది. కానీ వీటి నుండి వచ్చిన డబ్బులు ఒక్క రూపాయి కూడా తన సహా నిర్మాతలకు ఇవ్వలేదట విశ్వ ప్రసాద్. ఆయనతో పాటు సమానంగా పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా లాభాల్లో వాటా ఇవ్వకపోవడం ఎంత అన్యాయమే మీరే చూడండి.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి ఫోన్ చేసినా కూడా అందుబాటులోకి రాలేదట విశ్వ ప్రసాద్. కేవలం సహా నిర్మాతకు మాత్రమే కాదు, ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ కి కూడా పూర్తి స్థాయిలో పేమెంట్ చేయలేదట. అదే విధంగా డైరెక్టర్ శ్రీను వైట్ల, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ మరియు రచయితా, ఇలా ఎంతో మందికి డబ్బులు పూర్తి స్థాయిలో ఇంకా చెల్లించలేదట నిర్మాత విశ్వ ప్రసాద్. ఇలా పెండింగ్ పేమెంట్స్ ని పెట్టిన నిర్మాతతో ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Rajasaab Movie) లాంటి సినిమా ఎలా చేస్తున్నాడో అర్థం కావడం లేదంటూ వేణు ఆరోపిస్తున్నాడట. తమ అందరికీ పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించేవరకు ఆయన తదుపరి ప్రాజెక్ట్స్ ని ఆపేయాల్సిందిగా త్వరలోనే కోర్టు మెట్లు ఎక్కి పిటీషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడట వేణు. ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.