Producer SKN: కల్కి లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) నుండి రాబోతున్న చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab Movie). మారుతీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు తక్కువ గానే ఉండేవి. ఎందుకంటే మారుతీ ఒక మీడియం రేంజ్ డైరెక్టర్, ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో పని చేయడం అనేది చిన్న విషయం కాదు, ఆయన్ని హ్యాండిల్ చెయ్యలేరు అని అభిమానులు సోషల్ మీడియా లో అనుకునేవారు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ వచ్చిందో అప్పటి నుండి ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ట్రైలర్ అయితే బాగా పేలింది. ఇక నేడు సాయంత్రం ఈ సినిమా నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదల కానుంది. నిన్ననే ప్రోమో ని విడుదల చేశారు. రెస్పాన్స్ అదిరింది.
ఇది ఇలా ఉండగా ప్రభాస్ గత కొన్నేళ్లుగా పీఆర్ గా పని చేస్తూ వస్తున్న SKN (బేబీ నిర్మాత), రీసెంట్ గా ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో, రాజా సాబ్ గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా రిపోర్టర్ ప్రశ్న అడుగుతూ ‘చాలా సార్లు రాజాసాబ్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, ఈ సినిమా ఎందుకు అంత లేట్ అయ్యిందో చెప్పండి చాలు’ అని అంటాడు. దానికి SKN సమాధానం చెప్తూ ‘ఆలస్యం ఎందుకు అయ్యింది అనేది మీకు అనవసరమైన విషయం..లేటెస్ట్ గా ఏమి ఇస్తున్నాము అనేదే ముఖ్యం. మొదటి పాట ఈ నెల 23 న విడుదల కాబోతుంది. ఇక అప్పటి నుండి నాన్ స్టాప్ గా ఎదో ఒక అప్డేట్ రాజా సాబ్ నుండి వస్తూనే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబర్ 5 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. ఈ మేరకు టీజర్ ద్వారా అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్స్ సంక్రాంతికి వస్తేనే బాగుంటుంది అని నిర్మాత మీద ఒత్తిడి చేయడం తో ఈ చిత్రాన్ని జనవరి 9 కి వాయిదా వేశారు. సినిమా ఔట్పుట్ పై మేకర్స్ చాలా నమ్మకం తో ఉన్నారు. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యిందట. VFX షాట్స్ కూడా హాలీవుడ్ రేంజ్ క్వాలిటీ తో వచ్చాయట. చూడాలి మరి ఆడియన్స్ ని ఈ చిత్రం ఏ మేరకు అలరిస్తుంది అనేది.
