Vrushakarma First Look: ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున తర్వాత అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరో నాగ చైతన్య… గత కొద్ది రోజుల నుంచి నాగచైతన్యకు వరుస ప్లాప్ లు వస్తున్నప్పటికి మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈరోజు వృషకర్మ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీ లో నాగచైతన్య లుక్ చాలా అద్భుతంగా ఉంది. ఇక వృషకర్మ సినిమా స్టోరీని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ గా తెలుస్తోంది. అలాగే దానికి సంబంధించిన అంశాలను సైతం మిలితం చేసి స్క్రిప్ట్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాలను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. నాగచైతన్య ఒక రహస్యాన్ని చేదించడానికి కొండ గుహలకు వెళ్తాడు అక్కడ అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. అక్కడి నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు. అతన్ని వెంటాడుతున్న వారెవరు అనే దాని మీదనే ఈ సినిమా కథ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే ఈ సినిమాతో నాగచైతన్య మరోసారి సూపర్ సక్సెస్ ను సాధించి కం బ్యాక్ ఇస్తాడని అతని అభిమానులు ఆశిస్తున్నారు. కార్తీక్ దండు సైతం ఇంతకుముందు చేసిన విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. కాబట్టి అతనికి ఈ సినిమా మరో సక్సెస్ ని కట్టబెడుతోంది.
నాగ చైతన్య సాలిడ్ సక్సెస్ కోసం చాలారోజుల నుంచి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా అతని కెరియర్ ను మార్చేసే సినిమా అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తే మాత్రం నాగచైతన్య తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న వాడవుతాడు.
ఇక కార్తీక్ దండు సైతం ఇప్పుడు చేస్తున్న సినిమాల కంటే డిఫరెంట్ గా ఈ సినిమాను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… నాగచైతన్య ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటికంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. తన అభిమానుల కోసమే ఆయన డిఫరెంట్ సినిమాలను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటూ గతంలో చెప్పిన మాటలకు ఇప్పుడు జస్టిఫికేషన్ ఇస్తున్నాడు…