Producer Sireesh Comments On Ram Charan: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన పాన్ ఇండియన్ చిత్రం ‘గేమ్ చేంజర్'(Game Changer Movie). రామ్ చరణ్(Global Star Ram Charan) దురదృష్టమో, లేకపోతే నిర్మాతల దురదృష్టమో తెలియదు కానీ, రాధే శ్యామ్,ఆది పురుష్ చిత్రాల తర్వాత ‘గేమ్ చేంజర్’ చిత్రమే పాన్ ఇండియా హైప్ తో వచ్చి డిజాస్టర్ గా మిగిలిన ఏకైక సినిమాల జాబితాలోకి చేరింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ క్రెడిట్ కేవలం ఒకరి మీద వేసి నిందించలేం. మూవీ టీం మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయమిది. #RRR వంటి భారీ హిట్ తర్వాత ఒక మామూలు పొలిటికల్ సబ్జెక్టు ని ఎంచుకోవడం రామ్ చరణ్, దిల్ రాజు(Dil Raju) చేసిన మొదటి తప్పు. పైగా ఈ అవుట్ డేటెడ్ సబ్జెక్టు మీద నాలుగేళ్లు కూర్చోవడం ఇంకా పెద్ద తప్పు అనొచ్చు.
Also Read: చిరంజీవి సపోర్ట్ వల్లే ఆ నటుడు స్టార్ హీరోగా ఎదిగాడా..?
కానీ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్(Sireesh) పూర్తిగా రామ్ చరణ్ మీద మాటలు వదిలేస్తున్నారు. నిన్న దిల్ రాజు సోదరుడు మరియు వర్కింగ్ పార్టనర్ శిరీష్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ని తీవ్రమైన కోపానికి గురయ్యేలా చేసింది. ఇంతకీ ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ‘ఉదాహరణకు గేమ్ చేంజర్ చిత్రం తో మా బ్రతుకు అయిపోయింది అనుకున్నాం. సంక్రాంతికి వస్తున్నాం తో ఆశలు చిగురించాయి. 4 రోజుల్లోనే కదా మా జీవితం మారింది. సంక్రాంతికి వస్తున్నాం లేదు అనుకోండి, మా పరిస్థితి ఏంటో చెప్పండి ఒకసారి. దిల్ రాజు పని అయిపోయింది, శిరీష్ పని అయిపోయింది అని అనుకుంటారా లేదా?. ఎవరైనా వచ్చి మాకు త్యాగాలు చేస్తారా?, గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యింది, హీరో వచ్చి మాకు ఏమైనా సహాయం చేశాడా?, డైరెక్టర్ వచ్చి ఏమైనా మాకు సహాయం చేశాడా?, కనీసం ఫోన్ చేసి పరిస్థితి ఏంటి అని తెలుసుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
అప్పుడు యాంకర్ మాట్లాడుతూ ‘అదేంటి..రామ్ చరణ్ మాములుగా ఫోన్ చేసి అడుగుతాడు కదా’ అని అడగ్గా, దానికి శిరీష్ సమాధానం చెప్తూ ‘ఎవ్వరూ ఏమి అడగలేదు. మాకు సినిమా మీద ఇష్టముంది తీసుకున్నాం,పోగొట్టుకున్నాం’ అని అన్నాడు. మరి రామ్ చరణ్ రెమ్యూనరేషన్ ని తిరిగి అడిగారా అని యాంకర్ అడగ్గా, దానికి శిరీష్ సమాధానం చెప్తూ ‘అడగలేదు..మేము ఎవ్వరిని అలా అడగం కూడా..మా బ్యానర్ అంతకు దిగజారలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం కోసం రెండు సినిమాలను వదులుకొని మరీ తన నాలుగేళ్ల సమయాన్ని ఈ చిత్రం కోసం వెచ్చించాడు. అవుట్ డేటెడ్ స్టోరీ అని, టేకింగ్ తేడా కొడుతోంది అని షూటింగ్ మధ్యలోనే అర్థం అయ్యినప్పటికీ రామ్ చరణ్ వెనకడుగు వేయలేదు. ఆ నాలుగేళ్ల సమయంలో ‘పెద్ది’ లాంటి ప్రాజెక్ట్స్ రెండు చేసి ఉండొచ్చు, రెమ్యూనరేషన్ దాదాపుగా 200 కోట్లు వచ్చేవి అంటూ చెప్పుకొచ్చాడు.
Neither the hero #RamCharan nor the director Shankar helped us or even called us after the #GameChanger. pic.twitter.com/UPx32qlx1C
— Telugu Chitraalu (@TeluguChitraalu) June 30, 2025