Dil Raj Comments On Nithiin: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో దిల్ రాజు(Dil Raju) మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తూ ఉండడం విశేషం. ఇక రీసెంట్ గా ఆయన నితిన్ (Nithin) హీరోగా వస్తున్న తమ్ముడు (Thammudu) సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. మరో రెండు రోజుల్లో ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవ్వనున్న నేపధ్యం లో ఈ సినిమా ప్రమోషన్స్ లో మూవీ టీం పాల్గొంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే నితిన్ తో ఒక ఇంటర్వ్యూ ని ప్లాన్ చేసిన దిల్ రాజు ఆ ఇంటర్వ్యూ లో తన అహాన్ని చూపించాడు. నితిన్ లాంటి హీరోని ముందు పెట్టుకొని నువ్వు స్టార్ హీరోగా ఎదుగుతావని అనుకున్నాము కానీ ఎదగలేకపోయావు. ఈ 25 సంవత్సరాల కెరియర్లో నీకంటే వెనకాల ప్రొడ్యూసర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసిన నేను ఎక్కడున్నాను నాకంటే ముందు ఇండస్ట్రీలో హీరో గా పరిచయమైన నువ్వెక్కడున్నావు అంటూ నితిన్ ను డిగ్రేడ్ చేస్తూ కొన్ని మాటలైతే మాట్లాడాడు.
Also Read: చిరంజీవి సపోర్ట్ వల్లే ఆ నటుడు స్టార్ హీరోగా ఎదిగాడా..?
నిజానికి నితిన్ చాలా మంచి కెపాసిటి ఉన్న హీరో యూత్లో ఫాలోయింగ్ ఉన్న నటుడు ఆయన లవ్ స్టోరీస్ కి, యాక్షన్ సినిమాలకి చాలా బాగా సెట్ అవుతాడు. కానీ ఆయన స్టోరీ జడ్జిమెంట్ లో చాలా వరకు రాంగ్ స్టెప్స్ వేస్తున్నాడు. కాబట్టి తను హీరోగా సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు. అయినప్పటికి ఒక హీరో కి ప్రొడ్యూసర్ కి మధ్య పోటీ ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
నిజానికి నితిన్ వాళ్ల ఫాదర్ అయిన సుధాకర్ రెడ్డి దగ్గర సినిమాకు సంబంధించిన మెలుకువలు నేర్చుకున్న దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు. ఒకరకంగా దిల్ రాజు గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారు అంటే అది సుధాకర్ రెడ్డి అనే చెప్పాలి…నితిన్ వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి ది నిజామాబాద్.. దిల్ రాజు ది కూడా నిజామాబాదే వీళ్ళు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే ఇద్దరు రిలేషన్స్ అవుతారు. మరి ఇలాంటి సందర్భంలో మన వాళ్లను మనమే ఎందుకు కించపరుచుకోవాలి. దిల్ రాజు ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. కాబట్టి తను ఏం మాట్లాడిన నడుస్తుంది అనే ఒక దురంహకర భావంతో తన ఇంటర్వ్యూలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.
అల్లు అర్జున్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయనంత రేంజ్ కి వెళ్తావని అనుకున్నాను కానీ అక్కడిదాకా ఎదగలేకపోయావు అంటూ మొహం మీదే మాట్లాడడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం… ఒక రకంగా నితిన్ కి అవమానం జరిగినట్టు గా తెలుస్తోంది. ఆయన అభిమానులు కూడా దిల్ రాజు మీద ఫైర్ అవుతున్నారు. స్టార్ హీరోల కొడుకులు సైతం ఇండస్ట్రీకి భారీ బడ్జెట్ తో ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలు చేసి చాప చుట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
మరి అలాంటి వారితో పోల్చి వాళ్ళకంటే నువ్వు బెటర్ నితిన్ అని దిల్ రాజు ఎందుకు చెప్పలేకపోతున్నాడు. వాళ్ళ ప్రస్తావన తీసుకొస్తే దిల్ రాజు ఇండస్ట్రీలో ఉండగలుగుతాడా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి… నితిన్ కి అంత మార్కెట్ లేనప్పుడు ఎందుకని నీ తమ్ముడు సినిమాలో తీసుకున్నావు అని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు తన వైఖరిని మార్చుకొని ఇతరులతో ఎలా మాట్లాడాలి. రెస్పెక్టివ్ గా ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుంటే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆయన భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు అంటూ నితిన్ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…