Dil Ruba Producer : ఈమధ్య కాలం లో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి నిర్మాతలు కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. మా సినిమా చూడండి, నచ్చకపోతే మీ డబ్బులు వెనక్కి పంపేస్తాం వంటి కామెంట్స్ గతంలో చేసేవారు. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఇంకా భారీ సవాళ్లు చేస్తున్నారు. రీసెంట్ గానే ‘కోర్ట్'(Court Movie) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని మాట్లాడిన మాటలు మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ‘ఈ సినిమా చూడండి..నేను చెప్పిన రేంజ్ లో ఉండకపోతే, నేను నిర్మాతగా వ్యవహరించిన మరో సినిమా ‘హిట్ 3′ ని థియేటర్స్ లో చూడకండి. ఈ సినిమాకంటే మూడు రెట్లు డబ్బులు ఎక్కువ అక్కడ పెట్టాను నేను’ అంటూ చెప్పుకొచ్చాడు. నిన్న గాక మొన్న ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రం నచ్చకపోతే నా పేరు మార్చేసుకుంటాను అంటూ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ సంచలన సవాల్ విసిరాడు.
ఇప్పుడు కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) నటించిన లేటెస్ట్ చిత్రం ‘దిల్ రూబా'(Dilruba) చిత్ర నిర్మాత ఇదే తరహా కామెంట్స్ చేశాడు. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ‘మేము ఈ చిత్రాన్ని అత్యధిక శాతం మంగళూరు లో చేసాము. మేము షూటింగ్ చేసే సమయాల్లో జోరు వర్షం కురుస్తూ ఉండేది. అయినప్పటికీ 50 రోజుల పాటు అక్కడ షూటింగ్ ని చేసాము. మిగిలిన వర్క్ హైదరాబాద్ లో చేసాము. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి బయ్యర్స్ ముందుకొచ్చినప్పటికీ కూడా మేము అమ్మలేదు. సొంతంగా విడుదల చేయాలనీ అనుకున్నాము. ఈ చిత్రం మీద మాకు అంతటి నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఫైట్ సన్నివేశాలు అద్భుతంగా కుదిరాయి. థియేటర్స్ కి వచ్చిన వాళ్లంతా ఫైట్స్ చూసి మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి రావాలని అనుకుంటారు. మీకు ఆ రేంజ్ లో నచ్చకపోతే తెరని చింపేయండి, నేను బయట కనిపిస్తే నన్ను చిత్తకొట్టేయండి’ అంటూ బహిరంగంగా ప్రెస్ మీట్ లో సవాల్ విసిరాడు.
నిజంగానే సినిమాలో అంత కంటెంట్ ఉందా?, లేకపోతే ఓపెనింగ్స్ కోసం, ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి ఇలాంటి టెక్నీక్స్ ఉపయోగిస్తున్నాడా అనేది ఆడియన్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఒక సెక్షన్ ఆడియన్స్ మాత్రం ఇలాంటి మాటలకు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా ఇప్పటి నుండి ఈ సినిమా నుండి విడుదలైన ఏ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించలేదు. ‘క’ వంటి సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న సినిమా ఇది. అయినప్పటికీ మార్కెట్ లో బజ్ ఏర్పడలేదు. బుక్ మై షో లో ఈ చిత్రానికి గడిచిన 24 గంటల్లో కేవలం 6 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
Also Read : మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో కిరణ్ అబ్బవరం మూవీ… క్రేజీ న్యూస్!