Tollywood: సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా రాణించాలంటే కొంచెం కష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సినిమాకు కావాల్సిన బడ్జెట్ మొత్తం ఆ నిర్మాత వ్యవహరించాలి. ఒక్కొక్కసారి బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువ అవ్వచ్చు అటువంటి ఒడిదుడుకులను తట్టుకోగలిగితే ఇండస్ట్రీలో నిలబడ కలుగుతారు. అయితే ఇటీవల విడుదలైన ‘మధుర వైన్స్’ వెండితెర హిట్ గా నిలిచింది. దర్శకుడు జయకిషోర్ తెరకెక్కించిన చిత్రంలో హీరోగా సన్నీ నవీన్, హీరోయిన్ గా సీమా చౌదరి నటించారు. ప్రేమ కథ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రంతో ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం అయ్యారు ఆర్.కె. సినీ టాకీస్ అధినేత రాజేష్ కొండెపు.

అయితే తన తదుపరి చిత్రాన్ని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపారు రాజేశ్. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని వారి బ్యానర్‌లో ‘మధుర వైన్స్’ చిత్ర దర్శకుడు జయ కిషోర్ తో ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్ర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, భారీ తారాగణంతో, అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని నిర్మాత రాజేష్ కొండెపు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని… మరిన్ని వివరాలను వచ్చే ఏడాదిలో తెలుపుతామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్తా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.