Homeఎంటర్టైన్మెంట్Tollywood: సినిమా టికెట్ రేటు విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తా: నిర్మాత నట్టి కుమార్

Tollywood: సినిమా టికెట్ రేటు విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తా: నిర్మాత నట్టి కుమార్

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో టికెట్స్ రగడ ఆగడం లేదు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోయిన సినీ ఇండస్ట్రీ, థియేటర్స్ యాజమాన్యాలు ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన అఖండ, పుష్ప సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూళ్లు అందుకున్నాయి. నిర్మాతలతో పాటు థియేటర్స్ యాజమానులకు సైతం ఊరటనిచ్చింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేయగా… ఇప్పటికే పలుచోట్ల థియేటర్స్ మూతపడ్డాయి.

producer natti kumar sensational comments about movie ticket price

ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సినిమా విడుదల సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చు అంటూ జీవో జారీ చేసింది సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా నిర్మాత నట్టికుమార్ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పై అసహనం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో టికెట్స్ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల నట్టికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో సినిమా టిక్కెట్ల రేట్లు భారీగా పెంచడంతో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుంది నిర్మాత నట్టికుమార్ అన్నారు. టికెట్స్ రేట్స్ పెంచడం వలన చిన్న సినిమాలకు అన్యాయం జరగడమే కాకుండా, మల్టీఫ్లెక్స్‏లలో సినిమా చూడాలన్న కల కలగానే మిగిలి పోతుందని నట్టికుమార్ తెలిపారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ 1955 నిబంధనలు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో లేనే లేవని అన్నారు. చిన్న సినిమాలు కూడా లాభపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలని… పది రోజుల్లోగా చిన్న సినిమాలకు మేలు చేసే నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తానని నట్టికుమార్ అన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular