PM Modi: ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో తన విశ్వరూపం చూపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావానికి గురి కాకుండా ప్రజలు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేరళ, మహారాష్ర్ట, తమిళనాడు, బెంగాల్, జార్ఖండ్, మిజోరాం తదితర స్టేట్లలో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కొవిడ్ మహమ్మారి వేగాన్ని అంచనా వేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే పంజాబ్, ఉత్తర్ ప్రసాద్ తదితర స్టేట్లలో కూడా కేంద్ర బృందాలు ఐదు రోజుల పాటు సందర్శించనుంది. కొవిడ్ పరీక్షలు నిర్వహించి వైరస్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించనుంది.
Also Read: జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం.. ఎందుకిలా ముగించారు?
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒమిక్రాన్ తో ప్రపంచ దేశాలు కూడా కలవరపెడుతున్నాయి. ఒక వేళ వైరస్ వేగంగా విస్తరిస్తే దాని నుంచి కాపాడుకోవడానికి సుమారు 18 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలియజేస్తోంది. పిల్లలకు కూడా 90 వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయని చెబుతోంది.
ఈ నేపథ్యంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వారికి టీకాలు వేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మూడో దశ పిల్లలపై ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సినేషన్ వేసి వేరియంట్ ను నిరోధించేందుక చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
Also Read: ఏడాదిలో ఎంత తేడా: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం జగన్ కలిసిన సందర్భం..!