HIT 2 Movie- Nani: ఈ శుక్రవారం ఎలాంటి పోటీ లేకుండా అడివి శేష్ హిట్ 2 మూవీతో వచ్చాడు. విష్ణు విశాల్ మట్టి కుస్తీ చిత్రం కూడా విడుదలైనప్పటికీ… దానికి పెద్దగా ప్రచారం దక్కలేదు. రవితేజ ఈ చిత్ర నిర్మాత కావడం విశేషం. ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడంతో బజ్ ఏర్పడలేదు. పైగా మట్టి కుస్తీ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు హిట్ 2 మూవీకి క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి. పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా అభివర్ణిస్తున్నారు. పాజిటివ్ రివ్యూస్ నేపథ్యంలో టీమ్ హ్యాపీగా ఉన్నారు. హిట్ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు.

దర్శకుడు శైలేష్ కొలను, నిర్మాత నాని, హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి కలిసి హిట్ 2 సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు. షాంపేన్ పొంగించి, స్వీట్స్ పంచుకున్నారు. ఇక నాని ట్విట్టర్ వేదికగా మూవీ విజయంపై స్పందించారు. రెండింతలు సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నెక్స్ట్ కేడీ వర్సెస్ సర్కార్ అని ట్వీట్ చేశారు. హీరో అడివి శేష్ తో ఛీర్స్ చెబుతున్న ఫోటో షేర్ చేశారు. హిట్ 3 మూవీలో నాని నటిస్తున్న విషయం తెలిసిందే. హిట్ 2 క్లైమాక్స్ లో ఈ విషయం రివీల్ చేశారు. ఇక హిట్ 3 లో నాని పేరు సర్కార్ అని తెలుస్తుంది.
మంచి ఓపెనింగ్స్ సైతం హిట్ 2 రాబట్టింది. రూ. 13 నుండి 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన హిట్ 2 ఆ టార్గెట్ ఈజీగా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ కూడా లేదు. నిఖిల్ 18 పేజెస్, రవితేజ ధమాకా విడుదలయ్యే వరకు హిట్ 2 చిత్రానికి పోటీలేనట్లే. అడివి శేష్ మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. కృష్ణ దేవ్ గా హిట్ 2 మూవీలో ఆయన నటన అద్భుతం అంటున్నారు.

దర్శకుడు శైలేష్ కొలను హిట్ చిత్రానికి సీక్వెల్ లో హిట్ 2 తెరకెక్కించారు. పార్ట్ 1లో విశ్వక్ సేన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. హిట్ మూవీలో ఒక అమ్మాయి కిడ్నాప్ చుట్టూ డ్రామా నడిపిన దర్శకుడు కేస్ 2లో సైకో కిల్లర్ నేపథ్యం ఎంచుకున్నాడు. అమ్మాయిలను చంపుతున్న సీరియల్ కిల్లర్ ని వెంటాడే పోలీస్ కథగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో కథ పుంజుకొని అనూహ్య మలుపులతో సాగింది. క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది.
2 times happier 🙂#HIT2
Thank you all for the #BloodyBlockbuster ♥️KD X Sarkaar pic.twitter.com/osMYyKdTAa
— Nani (@NameisNani) December 2, 2022