Producer Nagavamsi : సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేర్లలో ఒకటి నాగవంశీ(Nagavamsi). కరోనా లాక్ డౌన్ తర్వాత ఈయన నిర్మించిన ప్రతీ సినిమా దాదాపుగా బాక్స్ ఆఫీస్ వద్ద సిక్సర్లు కొట్టాయి. ఈయన బ్యానర్ నుండి మంచి ఆల్ టైం క్లాసిక్ చిత్రాలు కూడా వచ్చాయి. అలా వరుసగా విజయాలు వచ్చేలోపు యాటిట్యూడ్ పెరిగిందో ఏమో తెలియదు కానీ, బలుపు మాటలు చాలానే మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల ఈయన నెటిజెన్స్ నుండి విపరీతమైన ట్రోల్స్ ని ఎదురుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఆయన యాష్ చోప్రా సంస్థ నుండి ‘వార్ 2’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసి, ఆ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ చేసిన కామెంట్స్ ఆడియన్స్ కి చాలా కోపం రప్పించాయి. ఆ సినిమా విడుదలై పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో నెటిజెన్స్ నాగవంశీ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు.
అంతే కాదు ఈ ఏడాది నాగవంశీ కి అటు నిర్మాతగా కలిసి రాలేదు, ఇటు బయ్యర్ గా కూడా కలిసి రాలేదు. కేవలం ‘కొత్తలోక’ అనే మలయాళం డబ్బింగ్ సినిమా తప్ప, అన్ని ఫ్లాప్స్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు ఆయన నుండి ‘epic’ అనే చిత్రం రాబోతుంది. బేబీ మూవీ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కింది. 90s అనే వెబ్ సిరీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా ఈ చిత్రం ఉండబోతుంది. ఆ వెబ్ సిరీస్ లో బుడ్డోడు గుర్తున్నాడు కదా?, వాడు పెరిగి పెద్దయ్యాక అమెరికా కి వెళ్లి చదువుకుంటున్న టైం కథ ఇది. ఆ క్యారక్టర్ ని ఆనంద్ దేవరకొండ పోషిస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని నేడు విడుదల చేసారు. ఇది శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగ సినిమాలోని హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ అంటూ ఆసక్తికరమైన పాయింట్ తో తెరకెక్కబోతుందని ఈ గ్లింప్స్ చివర్లో చెప్తారు. ఇకపోతే ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆ చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ఈ ఏడాది వరుస ఫ్లాప్స్ వచ్చేలోపు నన్ను కొంతమంది బాగా టార్గెట్ చేశారు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో మా బ్యానర్ నుండి నెలకు ఒక సినిమా రాబోతుంది. అన్ని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తాయి. నన్ను ట్రోల్ చేసిన వాళ్లకు త్వరలోనే సమాధానం చెప్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ‘epic’ గ్లింప్స్ ని మీరు కూడా చూసేయండి.