Producer Naga Vamsi warning: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే సినీ సెలబ్రిటీల పేర్లలో ఒకటి నాగవంశీ(Nagavamsi). నిర్మాత అయినప్పటికీ ఇతను మాట్లాడే మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంటాయి. బండ్ల గణేష్ తర్వాత మాటలతో అంతటి రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఏకైక నిర్మాత ఇతనే. అయితే యాటిట్యూడ్ తో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇతని పై సోషల్ మీడియా లో విపరీతమైన నెగిటివిటీ ఉంటుంది. ముఖ్యంగా ‘వార్ 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ సినిమా విడుదలై ఫ్లాప్ అయ్యాక నాగవంశీ ఎదురుకున్న ట్రోల్స్ ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఏ నిర్మాత కూడా ఎదురుకోలేదంటే అతిశయోక్తి కాదేమో. దెబ్బకు ఇక మైక్ ఎప్పటికీ పట్టుకోను అని కూడా చెప్పుకొచ్చాడు.
కానీ ఈ సంక్రాంతికి ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. దీంతో ఎంతో ఉత్సాహం కి గురైన నాగవంశీ మరోసారి మైక్ అందుకున్నాడు. ఈసారి తనపై ట్రోల్స్ చేసిన వారిపై చాలా గట్టి కౌంటర్లు ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘గడిచిన 72 గంటల్లో మా ఫ్యాన్ బాయ్స్ అందరూ కలిసి సోషల్ మీడియా లో నాపై, నా సినిమా పై తెగ డ్యూటీ చేస్తున్నారు. ఎవరి ఫ్యాన్ బాయ్స్ గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికి బాగా అర్థం అయ్యే ఉంటుంది. మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత రేంజ్ లో ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు. త్వరలోనే అవన్నీ అధికారికంగా ప్రకటిస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ.
ఇంతకీ నాగవంశీ ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నాడు..?, ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ యూనిట్ ని ఉద్దేశించి అన్నాడా?, చిరంజీవి ని విమర్శించేంత ధైర్యం నాగవంశీ కి ఉంటుందా?, పవన్ కళ్యాణ్ నాగవంశీ కి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ చిరంజీవి ని అంటాడా? అంటే కచ్చితంగా ఇది చిరంజీవి ని ఉద్దేశించి మాట్లాడినవి కాదని తెలుస్తుంది. ఈ చిత్రం తో పాటు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు కూడా విడుదల అయ్యాయి. కచ్చితంగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన వాళ్ళే ‘అనగనగా ఒక రాజు’ చిత్రం పై నెగిటివ్ పైడ్ రివ్యూస్ ఇచ్చి ఉంటాయి. అందుకే నాగవంశీ ఇలా మాట్లాడి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియా లో వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ఒక 72 hours నుంచి మా fan boys అందరు ఒకటే duty చేస్తున్నారు social media అంతా.
ఎవరి fan boys అనేది మీ అందరికి బాగా తెలుసు.
మీకు ఎలాంటి return gift ఇవ్వాలి ఎంత రేంజ్ లో ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు… త్వరలో అవన్నీ announce చేస్తాము.
– #NagaVamsi at #AnaganagaOkaRaju Meet pic.twitter.com/YF2HJwKABx
— Gulte (@GulteOfficial) January 16, 2026