https://oktelugu.com/

సిసిసి కి 3 లక్షలు ఇచ్చిన ఒరేయ్ బుజ్జిగా నిర్మాత

తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ` కరోనా క్రైసిస్ చారిటీ `( సి సి సి ) కి విరాళాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒరేయ్ బుజ్జిగా నిర్మాత కె. కె. రాధా మోహన్ తన వంతుగా మూడు లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది. కాగా సోమవారం నుంచి విరాళాల ద్వారా వచ్చిన డబ్బుతో సినీ కార్మికులకు నిత్యావసరాలు ఏర్పాటు చేసే కార్యక్రమం మొదలైంది. ఈ చారిటీ ద్వారా రోజువారీ వేతనం […]

Written By: , Updated On : April 7, 2020 / 10:18 AM IST
Follow us on


తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ` కరోనా క్రైసిస్ చారిటీ `( సి సి సి ) కి విరాళాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒరేయ్ బుజ్జిగా నిర్మాత కె. కె. రాధా మోహన్ తన వంతుగా మూడు లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది. కాగా సోమవారం నుంచి విరాళాల ద్వారా వచ్చిన డబ్బుతో సినీ కార్మికులకు నిత్యావసరాలు ఏర్పాటు చేసే కార్యక్రమం మొదలైంది. ఈ చారిటీ ద్వారా రోజువారీ వేతనం తో బతికే సినీ కార్మికులకు ఒక నెలకు సరిపడా సరుకులు అందజేయడం జరుగుతుంది.

అదలా ఉంటే యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు కొండా విజ‌య్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్త్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతోంది .కాగా కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ ను పోస్ట్ ఫోన్ చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ ఫస్ట్ వీక్ లో విడుద‌ల‌ చేయాలని నిర్మాత కె. కె. రాధా మోహన్ .ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌సీనియర్ నరేష్‌, పోసాని కృష్ణమురళి వంటి తారలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ చిత్ర నిర్మాత కె.కె. రాధామోహన్‌ గతంలో తన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకం పై `ఏమైంది ఈ వేళ‌`, `బెంగాల్ టైగ‌ర్‌` వంటి హిట్ చిత్రాల‌ను నిర్మించడం జరిగింది. రీసెంట్‌ గా కార్తి నటించిన ” ఖైదీ ”చిత్రాన్ని తెలుగులో అనువదించి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నారు ఇక `ఒరేయ్ బుజ్జిగా ` చిత్ర దర్శకుడు

‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను గతం లో అందించిన నేపధ్యం లో ఈ చిత్రాన్ని కూడా మంచి ఎంటర్టైనర్ గానే తీర్చి దిద్దాడని అంటున్నారు .