
నీనా గుప్తా.. ముప్పై ఏళ్ల క్రితమే బోల్డ్ నెస్ కి కేరాఫ్ గా నిలిచిన బోల్డ్ సీనియర్ నటి. ప్రస్తుతం బాలీవుడ్ లో బామ్మ, తల్లి పాత్రలతో ఫుల్ బిజీగా ఉంది నీనా గుప్తా. నీనా నటన గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె గొప్ప నటి. ఒకప్పుడు ఆమె హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది. ‘గాంధీ’ వంటి అంతర్జాతీయ సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకుంది.
అయితే, నీనా జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 62 ఏళ్ళ వయసులో ఆమె తనతో అప్పట్లో అసభ్యంగా ప్రవర్తించిన ఓ నిర్మాత గురించి సంచలన విషయాలను బయట పెట్టింది. తన ఆత్మకథ “సచ్ కహూతో” అనే పుస్తకంలో తన కెరీర్ కి సంబంధించిన అనేక విషయాలు రాసుకొచ్చింది నీనా.
ఈ సందర్భంగా ఓ దక్షిణాది నిర్మాత తనతో ఒక రాత్రి హోటల్ గదిలో ఏమి చేశాడో చెప్పుకొచ్చింది. మరి ఈ తతంగం గురించి ఆమె మాటల్లోనే ‘అతను, సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పేరున్న నిర్మాత. నాకు ఫోన్ చేసి తన సినిమాలో అవకాశం ఇస్తానని, ముంబైలోనే ఒక ఫేమస్ హోటల్ కి నన్ను పిలిపించారు. నేను హోటల్ లాబీలో వెయిట్ చేస్తుంటే.. ఆయన తన రూమ్ కి రమ్మని ఒత్తిడి చేసారు.
ఆ రోజుల్లో నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. దాంతో ఆ నిర్మాత రూమ్ లోకి జంకుతూనే వెళ్ళాను. ఆ నిర్మాత తన గొప్పతనం గురించి చెప్పి, నాకు హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర ఇస్తానని చెప్పాడు. నేను చిన్న పాత్రలు చేయదలుచుకోలేదు అంటూ బయలుదేరబోతుండగా, అదేంటి రాత్రికి ఇక్కడ పడుకోవా అని కోపంగా అడిగాడు. ఆ మాటకు నా హృదయం పగిలిపోయింది. అతన్ని తిట్టి కోపంతో బయటికి వచ్చేశాను’ అంటూ అప్పటి సంగతులు గుర్తు తెచ్చుకుని రాసుకొంది నీనా.