Game Changer Producer Dil Raju
Producer Dil Raju : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుందో మనమంతా చూసాము. ఓపెనింగ్స్ దగ్గర నుండి లాంగ్ రన్ వరకు, ప్రతీ అంశంలోనూ ఈ చిత్రం అభిమానుల అంచనాలకు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం అందుకు కారణం. అయితే ఈ సినిమాకి మొదటి రోజు 186 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటన చేయడం అప్పట్లో పెను దుమారం రేపింది. జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ కి, వేసుకున్న కలెక్షన్స్ కి అసలు పొంతనే లేదు. ఇలాంటి డిజాస్టర్ టాక్ తో ఆ చిత్రం అంత వసూళ్లను ఎలా రాబడుతుంది?, వచ్చిన కలెక్షన్స్ కి ఎదో పది కోట్లు, 20 కోట్లు అదనంగా వేసి చూపించడం ఇన్ని రోజులు మనం చూసాము, ఇక్కడ ఏకంగా 80 కోట్ల రూపాయిలను ఫేక్ చేసి చూపించారంటూ ట్రేడ్ పండితులు సైతం మండిపడ్డారు.
అయితే నేడు ఉదయం దిల్ రాజు తన ఇంటిపై గత నాలుగు రోజుల నుండి జరుగుతున్న ఐటీ సోదాలకు సంబంధించి మీడియా కి వివరణ ఇచ్చేందుకు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన్ని గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ పోస్టర్ గురించి అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘మేమొక్కరమే కాదు కదా..ప్రతీ ఒక్కరు ఇలాంటి పోస్టర్స్ ని వేస్తూనే ఉన్నారు. ఇది నేనొక్కడినే తీసుకునే నిర్ణయం కాదు. నిర్మాతలందరితో మాట్లాడి భవిష్యత్తులో ఇలా కలెక్షన్స్ పోస్టర్స్ మీద వేయాలా?, వద్దా అనేది నిర్ణయం తీసుకుంటాం. గేమ్ చేంజర్ కి మొదటి రోజు అంత వసూళ్లు రాలేదు అనేదే వాస్తవమే’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు దాదాపుగా 112 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఒక డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు రావడం నిజంగా గొప్పే. కానీ ‘గేమ్ చేంజర్’ కి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి చాలా తక్కువే అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 250 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగింది. అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా నష్టం అన్నమాట. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో అతి పెద్ద డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది ఈ చిత్రం. రామ్ చరణ్ అభిమానులు జీవితాంతం ఈ చిత్రం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మర్చిపోలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.