K Ramp Producer: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన ‘K ర్యాంప్’ చిత్రం నిన్న విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ హాఫ్ వరకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. పర్లేదు చాలా సన్నివేశాల్లో కామెడీ పేలింది, టైం పాస్ ఎంటర్టైనర్ అని చెప్పుకొచ్చారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని క్రింజ్ కామెడీ తో రోత పుట్టించారని రివ్యూయర్స్ చెప్పుకొస్తే, ఆడియన్స్ మాత్రం టైం పాస్ ఎంటర్టైనర్ అంటూ కితాబిచ్చారు. ఓవరాల్ గా కిరణ్ అబ్బవరం నుండి ఒక డీసెంట్ ఎంటర్టైనర్ వచ్చింది, థియేటర్స్ కి వెళ్లి చూడాలని అనుకున్నవాళ్ళు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా చూసేయొచ్చు అనే టాక్ వద్ద ఈ చిత్రం స్థిరపడింది. దీంతో ఓపెనింగ్ వసూళ్లు చాలా డీసెంట్ గా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా తక్కువ ఉండడంతో ఈ వీకెండ్ కి లాభాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. థియేటర్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ రావడం తో మేకర్స్ కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో ఆ చిత్ర నిర్మాత రాజేష్ దండా ఆన్లైన్ లో వచ్చిన రివ్యూస్ పై ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘నా సినిమాకే ఎంత రేటింగ్ ఇచ్చినా నేను పట్టించుకోను, స్వాగిస్తాను కూడా. కానీ కొంతమంది రివ్యూయర్స్ మా సినిమాపై పక్షపాతం చూపించడమే నన్ను బాధిస్తుంది. ట్విట్టర్ లో కొంతమంది రివ్యూయర్స్ ఫస్ట్ హాఫ్ కి రివ్యూ ఇచ్చి, సెకండ్ హాఫ్ కి మూడు గంటల తర్వాత రివ్యూ ఇస్తున్నారు’.
‘కొంతమంది అయితే ఇంకా ఆలస్యం చేస్తూ, వాళ్లకు తీరిక దొరికినప్పుడు రేటింగ్ ఇస్తున్నారు. ఇంత పక్షపాత ధోరణి ఎందుకు?, ఒక చిన్న నిర్మాత ఏమి చేసినా భరిస్తాడనే ధీమా తోనే ఇలా చేస్తున్నారు కదా?, ఇది కేవలం నా ఒక్కడి సమస్య మాత్రమే కాదు, నాలాంటి చిన్న నిర్మాతలందరికీ ఎదురు అవుతున్న సమస్య. అన్యాయంగా మమ్మల్ని తోక్కేస్తున్నారు. బహుబాలి లాంటి పెద్ద సినిమాకు అయినా,K ర్యాంప్ లాంటి చిన్న సినిమాకు అయినా ఒకే విధంగా వ్యవహరించాలి’ అంటూ ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు. దీనికి స్పందించిన నెటిజెన్స్ మంచి సినిమాని ఎలా ఉన్నా ఆదరిస్తారు, రివ్యూయర్స్ ని పట్టించుకోకండి, ఓజీ లాంటి చిత్రానికే డిజాస్టర్ రేటింగ్స్ ఇచ్చారు, కానీ ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనమంతా చూసాము, మంచి సినిమాని ఆడియన్స్ భుజాల మీద మోస్తారు, బాధపడకండి అంటూ కామెంట్స్ చేశారు.