https://oktelugu.com/

పాపం మళ్ళీ మోసపోయింది.. ‘అమలా పాల్’కే ఎందుకిలా ?

‘మైన’ అనే సినిమాతో సౌత్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ‘అమలా పాల్’ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. కెరీర్ మొదట్లో తానూ అన్ని విధాలుగా చాల ఇబ్బందులు పడ్డానని, కొంతమంది మేనేజర్లకు అసలు విలువులు ఉండవని.. వాళ్లకు అవకాశం వస్తే హీరోయిన్లతో వాళ్ళు ఆడుకుంటారని ఇలా తన సినీ ప్రయాణమే మోసంతో మొదలైందని అమలాపాల్ చెప్పుకొచ్చింది. ఇలా ఎన్నో భరించి ఎలాగోలా తనదైన గ్లామర్ తో, నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో జోడి […]

Written By:
  • admin
  • , Updated On : April 17, 2021 / 03:06 PM IST
    Follow us on


    ‘మైన’ అనే సినిమాతో సౌత్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ‘అమలా పాల్’ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. కెరీర్ మొదట్లో తానూ అన్ని విధాలుగా చాల ఇబ్బందులు పడ్డానని, కొంతమంది మేనేజర్లకు అసలు విలువులు ఉండవని.. వాళ్లకు అవకాశం వస్తే హీరోయిన్లతో వాళ్ళు ఆడుకుంటారని ఇలా తన సినీ ప్రయాణమే మోసంతో మొదలైందని అమలాపాల్ చెప్పుకొచ్చింది. ఇలా ఎన్నో భరించి ఎలాగోలా తనదైన గ్లామర్ తో, నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో జోడి కట్టి.. స్టార్ హీరోయిన్ అని పిలిపించుకునే స్థాయికి వెళ్ళింది.

    పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇలా సౌత్ సినిమాల అన్నిటిల్లో నటించిన ఆమె, కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో ప్రేమాయణం సాగించి.. అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత కొన్నాళ్ల పాటు బాగానే కాపురం చేసింది. కానీ ఏమైందో ఏమో గాని దర్శకుడు విజయ్, అమలాపాల్ ను మధ్యలో విడిచిపెట్టాడు. ఆ తరువాత ఓ ఇంటర్వ్యూలో పెళ్లి విషయంలో తానూ మోసపోయానని, తానూ తొందరపడకుండా ఉండాల్సిందని అమలాపాల్ చెప్పుకొచ్చింది.

    ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ఈ అమ్మడు సినిమాలపైనే ఫోకస్ పెట్టి.. సెకెండ్ ఇన్నింగ్స్ ను బాగానే హ్యాండిల్ చేస్తోంది. అయితే అమలాపాల్ ఆ మధ్య నిర్మాతగా కూడా ఓ సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా, శిల్పా శెట్టి లాంటి హీరోయిన్లు కూడా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి సత్తా చాటడంతో అమలాపాల్ కూడా అదే స్ఫూర్తితో సినిమా నిర్మాణం చేపట్టింది. ఎంతైనా హీరోయిన్.. పైగా నిర్మాణం పై పెద్దగా అవగాహన లేదు.

    అందుకే, తప్పక ఓ మేనేజర్ ను నమ్మి అతని చేతిలో డబ్బులు పెట్టింది. అనుకున్న ప్రకారం బడ్జెట్ లోపే సినిమా పూర్తి చేయాలని అమలాపాల్ కండీషన్. అయితే నిర్మాణ లెక్కల్లో కొన్ని లొసుగులు ఉన్నాయని.. పైగా బడ్జెట్ కూడా అనుకున్న ఎమౌంట్ కంటే ఎక్కువైందని.. అసలుకే మలయాళ సినిమా కాబట్టి.. పెద్దగా రెవిన్యూ కూడా ఉండదు, మరి ఇప్పుడు అమలాపాల్ ఏమి చేస్తోందో చూడాలి. మొత్తానికి అమలాపాల్ మరోసారి మోసపోయింది. పాపం ‘అమలా పాల్’ ఎందుకు ఇలా జరుగుతుందో.