Samantha : సౌత్ ఇండియా లో టాప్ 5 హీరోయిన్స్ లిస్ట్ ని ఒకసారి తీస్తే, అందులో సమంత పేరు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈమె తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్స్ కొట్టే రేంజ్ కి ఎదిగిపోయింది. అందంతో మాత్రమే కాదు, అభినయంతో కూడా అలరించగలను అని నిరూపించుకుంది. అందుకే తక్కువ సమయంలో సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. హీరో ఎవరైనా కానీ, తనని చూసి థియేటర్స్ కి కదిలేంత ఆడియన్స్ ని సంపాదించుకుంది ఈమె. ఇక నాగచైతన్య తో పెళ్లి, ఆ తర్వాత విడాకులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పీరియడ్ లో సమంత ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ ని ఆపేసింది. కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. మధ్యలో విలన్ రోల్స్ కూడా చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
అయితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ , రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్స్ తో కలిసి సినిమాలు చేసే రోజుల్లోనే ఈమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి డెబ్యూ హీరో తో ‘అల్లుడు శ్రీను’ లాంటి సినిమాలు కూడా చేసింది. ఈ చిత్ర నిర్మాణం సమయంలో సమంత తో తనకి ఎదురైనా అనుభవాలను, ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘సమంత అప్పటికే పెద్ద స్టార్ హీరోయిన్. కొత్త హీరో అయినటువంటి నా కొడుకు సినిమాలో నటిస్తుందో లేదో అనే భయం నాలో ఉండేది. కానీ అడిగిన వెంటనే ఆమె నా మీద గౌరవంతో ఈ సినిమాని చేసేందుకు ఒప్పుకుంది’ అని చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సమంత కి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. చర్మ సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతూ ఉన్నింది. ఆ సమయంలో ఆమెకి చికిత్స కోసం పాతిక లక్షలు అవసరం ఉంటే, నేనే ఆ డబ్బులను సమకూర్చను. ఆ తర్వాత ఆమె రెమ్యూనరేషన్ లో ఆ డబ్బులను కట్ చేసుకుంది. సినిమా విడుదలై పెద్ద హిట్ అయ్యింది. భారీ లాభాలు వచ్చాయి. ఆ ఆనందం లో నేను సమంత కి ఒక ఫామ్ హౌస్ ని బహుమతిగా ఇచ్చాను’ అని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ సురేష్. ఈ ఫామ్ హౌస్ విలువ 3 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే సమంత రీసెంట్ గానే ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ తో మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ తర్వాత ఆమె మరో హిందీ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.