AP Ration Dealer Posts : ఏపీలో రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 57 పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లో 36, పాలకొండ రెవెన్యూ డివిజన్‌లో 21 పోస్టులు, అన్నమయ్య జిల్లాలో మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో 119 రేషన్ డీలర్లకు నియామకం చేపట్టనుంది. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 21 చివరి తేదీ. దీనికి రాత పరీక్ష, ఇంటర్వూలు ద్వారా ఎంపిక చేస్తారు. అయితే ఈ రేషన్ డీలర్ల నోటిఫికేషన్‌కు అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. అలాగే వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. అయితే ఒక్కో కేటగిరీ బట్టి వయస్సు మినహాయింపు ఉంటుంది. ఈ డీలర్ పోస్టులకు అప్లై చేయాలంటే వారు అదే గ్రామానికి చెందిన వారు అయి ఉండాలి. అయితే ఏఎన్‌ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యావాలంటీర్లు, ఆశ కార్యకర్తలు వంటి వారు అప్లై చేయకూడదు. ఎందుకంటే ఆర్థిక స్తోమత లేని వారికే ఈ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వనున్నారు.
రేషన్ డీలర్ల పోస్టులకు అప్లై చేయాలంటే వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. అలా ఉంటే వారు అప్లై చేయడానికి కుదరదు. అలాగే వారి కుటుంబ ఆర్థిక స్థోమత వివరాలు కూడా పూర్తి తెలియజేస్తూ ఓ డిక్లరేషన్ ఇవ్వాలి. దీనికి ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. రాత, ఇంటర్వూ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు మొత్తం 100 మార్కులు ఉండే ఈ పేపర్‌లో 80 రాత పరీక్ష, మరో 20 ఇంటర్వ్యూకు ఉంటాయి. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే వారు ఇంటర్మీడియల్, పది సర్టిఫికేట్లు, వయస్సు ధ్రువీకరణ పత్రం, ఓటరు, ఆధార్, పాన్ కార్డు, మూడు పాస్ ఫొటోలు, క్యాస్ట్ సర్టిఫికేట్, నిరుద్యోగిగా ఉన్న పత్రాలతో అప్లికేషన్ ఫిల్ చేసి ఆర్డీవో లేదా తహశీల్దారు కార్యాలయానికి వెళ్లి నేరుగా లేదా పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. అన్ని పత్రాలు ఇస్తేనే మీ అప్లికేషన్‌ను వారు తిరస్కరించకుండా ఉంటారు. అయితే ఆయా డివిజన్ల బట్టి ఒక్కో రోజు పరీక్ష ఉంటుంది. అందరూ కూడా పత్రాలను డిసెంబర్ 18లోగా ఇవ్వాలి.
పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలోని 36 పోస్టులకు దరఖాస్తులను ఇచ్చిన తర్వాత డిసెంబర్ 19న పరిశీలన చేసి డిసెంబర్ 21న హాల్ టికెట్లు ఇస్తారు. ఆ తర్వాత డిసెంబర్ 23న పరీక్ష నిర్వహించి, 26న ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ 28న ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఫలితాలు డిసెంబర్ 30న విడుదల చేస్తారు. పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో 21 రేషన్ డీలర్ల పోస్టులకు కూడా ఇదే తేదీల్లో సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తారు. అదే అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో అయితే డిసెంబర్ 21కి సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత రోజు దరఖాస్తులు పరిశీలన చేసి డిసెంబర్ 24న హాల్ టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్ 28న పరీక్ష నిర్వహించి, డిసెంబర్ 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి 2025 జనవరి 2వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు.