Devara 2 Shooting: #RRR వంటి సెన్సేషనల్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) కొరటాల శివ(Koratala Siva) తో చేసిన ‘దేవర’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓపెనింగ్ దగ్గర నుండి ఫుల్ రన్ వరకు అభిమానులకు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చిన చిత్రమిది. దాదాపుగా 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ కొరటాల శివ క్లిప్ హ్యాంగర్ ద్వారా ఆడియన్స్ కి చెప్తాడు. దేవర ని చంపింది సొంత కొడుకు ‘వర’ అని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో సీక్వెల్ లో చూడండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇది అప్పట్లో బాహుబలి ని కాపీ కొట్టారంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అసలు దేవర లో పెద్దగా కంటెంట్ ఏమి లేదు, కేవలం అనిరుద్ మ్యూజిక్, ఎన్టీఆర్ క్రేజ్ వల్ల ఆడిందని అందరు అంటుంటారు.
ఎదో అదృష్టం కలిసొచ్చి ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది, కానీ కంటెంట్ పరంగా చూస్తే గొప్ప సినిమా అయితే కాదు, అలాంటి చిత్రానికి సీక్వెల్ ఏంటి?, ఇది వర్కౌట్ అవ్వదు, అసలు ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పటికీ రాదంటూ సోషల్ మీడియా లో ప్రచారం సాగింది. ఎన్టీఆర్ కూడా ఈ సీక్వెల్ వర్కౌట్ అవ్వడం అసాధ్యమని, ఈ చిత్రాన్ని వదిలేసి వేరే స్టోరీ ఏమైనా ఉంటె వేరే హీరో తో చేసుకోమని ఎన్టీఆర్ చెప్పినట్టు సోషల్ మీడియా బోలెడన్ని ప్రచారాలు జరిగాయి. కానీ ‘దేవర 2’ కచ్చితంగా ఉంటుందని రీసెంట్ గానే ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ మిక్కిలినేని ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
‘దేవర 2’ చిత్రం అసలు ఉంటుందా లేదా?, ఉంటే ఎప్పటి నుండి మొదలు అవుతుంది? అని యాంకర్ అడగ్గా, దానికి సుధాకర్ సమాధానం చెప్తూ ‘మే నెల నుండి దేవర సీక్వెల్ మొదలు అవుతుంది. 2027 లో ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది. కమర్షియల్ గా ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ అవ్వుద్ది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వేరే లెవెల్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయినా వెంటనే ఆయన ‘దేవర 2’ ని మొదలు పెడతాడని , కొరటాల శివ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ ని రెడీ చేసి చాలా కాలమే అయ్యిందని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా మొదలు అవుతుందా లేదా అనేది.
Producer Sudhakar Mikkilineni recent update:
– The shooting of #Devara2 is tentatively planned to begin in May this year.
– The film is scheduled for a 2027 release.#NTRNeel #GodofWar @tarak9999pic.twitter.com/iVvh1SOQYe
— NTR – KING OF MASS (@KingJrNTR) January 27, 2026