https://oktelugu.com/

Hari Hara Veera Mallu: అభిమానులను పిచ్చోళ్లను చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..విడుదల తేదీ పై అసలు నిజాలు ఇవే!

ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. రీ రికార్డింగ్, ఫైనల్ మిక్సింగ్ కూడా చేసి పక్కన పెట్టారు. ఇక సెకండ్ హాఫ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది.

Written By: , Updated On : February 19, 2025 / 01:13 PM IST
Hari Hara Veeramallu

Hari Hara Veeramallu

Follow us on

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమా విషయంలో ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) అభిమానులను మోసం చేస్తున్నాడా?, వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుంటూ కాలయాపన చేస్తున్నాడా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఈ చిత్రాన్ని మార్చి 28 వ తారీఖున విడుదల చేస్తామని ప్రకటించి చాలా కాలమే అయ్యింది. ప్రకటన అయితే చేసారు, ఆ సమయానికి సినిమా విడుదల కావడం అసాధ్యం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపించింది. ఈ వార్త సోషల్ మీడియా లో బాగా ప్రచారమైనప్పుడల్లా, నిర్మాత ఏఎం రత్నం మీడియా కి అలాంటిదేమి లేదు, మార్చి 28న విడుదల చేస్తున్నాం, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదంటూ ఒక ప్రకటన విడుదల చేస్తూ వచ్చాడు. నిన్న కూడా అలాంటి ప్రకటనే చేసాడు. దీంతో అభిమానుల్లో ఈ చిత్రం అనుకున్న సమయానికే విడుదల చేయబోతున్నారనే నమ్మకం కలిగింది. కానీ వాస్తవంగా చూస్తే ఈ చిత్రం మార్చి 28న విడుదల అవ్వడం అసాధ్యం అని అంటున్నారు.

ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. రీ రికార్డింగ్, ఫైనల్ మిక్సింగ్ కూడా చేసి పక్కన పెట్టారు. ఇక సెకండ్ హాఫ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది. కేవలం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) కి సంబంధించిన నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందట. నేడు కూడా ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ కి సంబంధించిన VFX వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉందట. గత ఏడాది సెప్టెంబర్ నెల నుండి ఇప్పటి వరకు దాదాపుగా నెల రోజుల షూటింగ్ జరిగింది. ఈ నెల రోజుల షూటింగ్ కి సంబంధించిన VFX షాట్స్ ఇంకా సిద్ధం కాలేదట. మార్చి 5 లోపు అవి డెలివరీ అవుతాయని ఆశిస్తున్నారు కానీ, ఇంకా సమయం పట్టే అవకాశం ఉందట.

అంతే కాకుండా పవన్ కళ్యాణ్, సత్యరాజ్ మధ్య తెరకెక్కబోయే సన్నివేశానికి కూడా VFX వర్క్ చేయాలట. పవన్ కళ్యాణ్ ఆ సన్నివేశాన్ని షూట్ చేయడానికి ఇంకా డేట్స్ కేటాయించలేదు. ఆయన డేట్స్ ఎప్పుడు ఇవ్వాలి?, షూటింగ్ పూర్తి చేసిన తర్వాత వాటికి VFX ఎప్పుడు చేయాలి, ఫైనల్ కాపీ ఇంకెప్పుడు సిద్ధం చేయాలి?, ఇవి అన్ని జరగడానికి కనీసం 20 నుండి 30 రోజుల సమయం పడుతుంది. సినిమా విడుదలకు కేవలం 39 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. పవన్ కళ్యాణ్ ని చూస్తే మార్చి రెండవ వారం వరకు డేట్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. కాబట్టి ఈ చిత్రం మార్చి 28 న విడుదలయ్యే అవకాశాలు అసలు లేవని, నిర్మాత ఏఏం రత్నం కావాలని ఇలా చేస్తున్నాడని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ఈ చిత్రం నుండి రెండవ పాట ‘కొల్లగొట్టినాదిరో’ ఈ నెల 24న విడుదల కానుంది.