SS Rajamouli-Rajamouli
SS Rajamouli : డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) ఇప్పుడంటే పాన్ వరల్డ్ డైరెక్టర్. కానీ ఆయన కెరీర్ బుల్లితెర నుండే మొదలైంది అనే విషయం అందరికీ తెలిసిందే. రాఘవేంద్ర రావు నిర్మాతగా, రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ‘శాంతి నివాసం’ అనే సీరియల్ అప్పట్లో పెద్ద హిట్. ఈ సీరియల్ మధ్యలోనే ఆయన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాకి షిఫ్ట్ అయిపోయాడు. ఇక అక్కడి నుండి రాజమౌళి కెరీర్ ఎలా సాగింది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే తన సినిమాకి ప్రొమోషన్స్ విషయంలో రాజమౌళి మొదటి నుండి చాలా కొత్త ఆలోచనలతో మన ముందుకు వచ్చేవాడు. అలా ఆయన ‘విక్రమార్కుడు’ సినిమా షూటింగ్ సమయంలో, ప్రముఖ యాంకర్ రష్మీ(Anchor Rashmi) తో కలిసి చేసిన ఒక రొమాంటిక్ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. విక్రమార్కుడు మూవీ ప్రొమోషన్స్ లో భాగంగానే ఆయన ఈ సన్నివేశం చేసినట్టు చెప్తున్నారు.
అప్పట్లో రష్మీ ఇంకా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టలేదు. రేడియో జాకీ గా ఆమె కొనసాగే రోజులవి. అప్పట్లో షూట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు చాలా కాలం తర్వాత సోషల్ మీడియా తవ్వకాల్లో బయటపడి వైరల్ అయ్యింది. ఈ వీడియో లో రాజమౌళి ప్రతీ రోజు రష్మీ కి ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడే అబ్బాయి గా కనిపిస్తాడు. రష్మీ కి మొదటి నుండి రాజమౌళి అంటే ఇష్టం ఉంటుంది. తనకి ఫోన్ కాల్స్ చేసి రోజుకి అన్ని గంటలు మాట్లాడుతున్నది రాజమౌళి నే అని తెలుసుకొని ఎంతో సంబరపడుతుంది. ఆ తర్వాత వీళ్లిద్దరు మాట్లాడుకుంటారు. మిగిలిన వీడియో ని మీరే ఈ ఆర్టికల్ చివర్లో చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు రాజమౌళి లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నవ్వుకుంటున్నారు.
అప్పట్లో ఇలాంటి వీడియోలు చేసిన రాజమౌళి, ఇప్పుడు మన టాలీవుడ్ ని హాలీవుడ్ కి తీసుకెళ్లే స్థాయికి ఎదిగాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే #RRR వంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత రాజమౌళి మహేష్ బాబు(Mahesh Babu) తో ఒక పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసినట్టు సమాచారం. రెండవ షెడ్యూల్ రెండు రోజుల క్రితమే మొదలైంది. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరెకక్కుతున్న ఈ సినిమా కోసం దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా విలన్ గా నటించనుంది. అదే విధంగా బాలీవుడ్ నుండి జాన్ అబ్రహం కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం.
Orey #Rajamouli ❌ #Rashmi pic.twitter.com/ZzaTzTSHEU
— Movies4u Official (@Movies4u_Officl) February 18, 2025