Allu Aravind: చిరంజీవి మీద కోపం తోనే అల్లు అరవింద్ ఆ స్టార్ హీరో కి దగ్గరయ్యాడా..?

చిరంజీవి లాంటి గొప్ప మనిషి ఇండస్ట్రీ లో ఇంకొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎవరైనా సరే తమ స్వార్థాల కోసం ఆలోచిస్తూ మనమే ఎదగాలి అని అనుకుంటారు కానీ చిరంజీవి మాత్రం తన చుట్టూ ఉన్న వారిని కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు..

Written By: Gopi, Updated On : November 21, 2023 3:54 pm

Allu Aravind

Follow us on

Allu Aravind: తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశ మార్చిన ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ముందు తెలుగు సినిమా అంటే ఒక మూస ధోరణి లో నత్త నడకన సాగుతూ వచ్చేది. ఇక ఎప్పుడైతే చిరంజీవి ఒక్కసారి హీరో గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడో తెలుగు సినిమా మొత్తాన్ని మార్చేశాడు. తనదైన డాన్స్ లతో, తనదైన ఫైట్లతో ప్రేక్షకులందరిని అలరిస్తూ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగాడు. ఇక ఇలాంటి క్రమంలో వరుసగా సినిమాలు చేయడమే కాకుండా తన చుట్టూ ఉన్నవాళ్లను కూడా పైకి తీసుకొచ్చే క్రమంలో అందర్నీ ఆదరించాడు.

అయితే చిరంజీవి లాంటి గొప్ప మనిషి ఇండస్ట్రీ లో ఇంకొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎవరైనా సరే తమ స్వార్థాల కోసం ఆలోచిస్తూ మనమే ఎదగాలి అని అనుకుంటారు కానీ చిరంజీవి మాత్రం తన చుట్టూ ఉన్న వారిని కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు… ఇక అందులో భాగంగానే అల్లు అరవింద్ ను కూడా ఎంకరేజ్ చేస్తూ గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే చిరంజీవి ఎక్కువ సినిమాలు చేస్తూ తనని ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్ గా నిలబెట్టే ప్రయత్నం చేశాడు…చిరంజీవి అనుకున్నట్టుగానే అల్లు అరవింద్ ను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా చేశాడు.

ఇక అరవింద్ చిరంజీవి ఇద్దరిని కూడా ఇండస్ట్రీలో కృష్ణార్జునులు అంటూ అప్పట్లో పిలిచేవారు. అయితే గత కొద్ది రోజులు గా అల్లు అరవింద్ సపరేట్ అయి చిరంజీవి గారిని పట్టించుకోవట్లేదు అనే వార్తలు అయితే ఫుల్ గా వస్తున్నాయి. అందులో భాగంగానే చిరంజీవి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు.ఇక ఇలాంటి క్రమం లో అరవింద్ చిరంజీవి కి వ్యతిరేకంగా బాలయ్య లాంటి స్టార్ హీరో పక్కన చేరి అతని సినిమాలకు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అతనితో పాటు ఇప్పటికే ఆన్ స్టాపబుల్ షో చేస్తూన్నాడు. అలాగే వాళ్ల బ్యానర్ లో ఏ ఫంక్షన్ జరిగిన కూడా బాలయ్య బాబుని చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నాడు. ఇక దీని వెనుక అసలు కారణం ఏంటి అనేది తెలియదు గానీ అరవింద్ కి చిరంజీవికి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్టుగా తెలుస్తుంది…

ఇక వాళ్ళు ఏం చేసినా కానీ చిరంజీవి మాత్రం వాటిని పట్టించుకోకుండా తన సినిమాలో తను బిజీ అవుతూ నెక్స్ట్ ఏం సినిమా చేయాలి అనే దానిమీదనే ఎక్కువ ఫోకస్ పెడుతూ వస్తున్నాడు. అందుకే చిరంజీవి ఇప్పటికి కూడా చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే మొన్నటిదాకా మెగాస్టార్ సినిమాలు చేసిన అరవింద్ ఇప్పుడు డబ్బులు బాగా సంపాదించుకున్న తర్వాత మెగాస్టార్ ని పక్కన పెట్టేయడం చూసిన మెగా అభిమానులు మాత్రం అరవింద్ మీద ఫైర్ అవుతున్నారు.

ఎందుకంటే చిరంజీవితో అవసరం ఉన్నంత సేపు అతన్ని బాగా వాడుకొని ఇక మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చిరంజీవిని పట్టించుకోకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు అంటూ అరవింద్ మీద కొంత మంది నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ లో చిరంజీవి స్టార్ డం ని చూసి ఓర్వలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు…