Priyanka Mohan Comments On Prakash Raj: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ప్రకాష్ రాజ్(Prakash Raj) కాంబినేషన్ వెండితెర పై ఎలాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుస్వాగతం, బద్రి, జల్సా, కెమెరా మెన్ గంగతో రాంబాబు, వకీల్ సాబ్, ఇలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒకప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు బాగా అభిమానించుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకుంటున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రకాష్ రాజ్ ని పట్టించుకోడు కానీ, ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ని సందర్భం దొరికినప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే మరో వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ నుండి విడుదల కాబోతున్న మోస్ట్ క్రేజీ మూవీ ‘ఓజీ'(They Call Him OG) లో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర పోషించాడు.
Also Read: ముంబై వేస్ట్.. బెంగళూరు బెస్ట్.. బాలీవుడ్ విలక్షణ డైరెక్టర్ తెలుసుకున్న నీతి ఇదీ
పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా విమర్శించిన తర్వాత కూడా వీళ్లిద్దరు కలిసి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారట. అలా వీళ్లిద్దరు కలిసి షూటింగ్ లో పాల్గొన్నప్పుడు అసలు ఎలా మాట్లాడుకుంటారు?, ఒకరి ముఖం ఒకరు ఎలా చూసుకుంటారు అని అభిమానులకు అనుమానం రావొచ్చు. ఇదే విషయాన్ని ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మీడియా రిపోర్టర్ అడుగుతాడు. దానికి ప్రియాంక మోహన్ సమాధానం చెప్తూ ‘నేను రాజకీయాలను అంతగా అనుసరించను, పవన్ సార్ డిప్యూటీ సీఎం అయ్యాక నాతో కొన్ని కాంబినేషన్ సన్నివేశాలు చేసాడు. ఆ సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు. ఆయనతో పవన్ సార్ చాలా మంచిగానే మాట్లాడేవాడు నేను చూసినన్ని రోజులు’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక మోహన్. అంటే రాజకీయం రాజకీయమే, సినిమా సినిమానే, రెండు వేర్వేరు కోణాల్లో చూడాలి అనేది వీళ్లిద్దరు నిరూపించి చూపించారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే చేసారు మేకర్స్. సాధారణంగా ఏ సినిమాకు అయినా థియేట్రికల్ ట్రైలర్ వారం రోజుల ముందు కానీ, లేదా వారం రోజుల తర్వాత కానీ చేస్తారు. కానీ ఈ సినిమాకు మాత్రం నాలుగు రోజుల ముందు చేస్తున్నారు. కారణం ఏదైనా కానీ, అభిమానులు మాత్రం ఈ జాప్యం పై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా అదే రోజున ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ ని జారీ చేశారు.