Megastar Chiranjeevi And Karthik Ghattamaneni: మీడియం రేంజ్ బడ్జెట్ తో హై క్వాలిటీ సినిమాలు ఎలా తియ్యాలి అనేది ‘మిరాయ్'(Mirai Movie) డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) ని చూసి కొంతమంది డైరెక్టర్స్ నేర్చుకోవచ్చు. హీరో తేజ సజ్జ కి అన్నీ అలా కలిసి వచ్చేస్తాయి ఏంటో. ఆయన గత చిత్రం ‘హనుమాన్’ కూడా ఇంతే. తక్కువ బడ్జెట్ తో 300 కోట్ల రూపాయలకు పైగా క్వాలిటీ సినిమాని తన నుండి అందించాడు. అప్పట్లో ఈ సినిమా క్వాలిటీ ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. పెద్ద డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ ని చూసి సినిమాలు ఎలా తియ్యాలో నేర్చుకోండి అన్నారు. ఇప్పుడు మిరాయ్ సినిమాకు కూడా అలాంటి కామెంట్స్ బలంగా వినిపించాయి. తేజ సజ్జ తన డైరెక్టర్స్ తో అలా చెప్పి చేయించుకుంటాడా?, లేదా యాదృచ్చికంగా ఆయనకు అలా సెట్ అయిపోతాయా అనేది తెలీదు కానీ, కార్తీక్ ఘట్టమనేని మాత్రం మంచి టాలెంటెడ్ టెక్నీషియన్.
Also Read: ముంబై వేస్ట్.. బెంగళూరు బెస్ట్.. బాలీవుడ్ విలక్షణ డైరెక్టర్ తెలుసుకున్న నీతి ఇదీ…
సినిమాటోగ్రాఫర్ గా ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించాడు. డైరెక్టర్ గా కాకుండా సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ని కొనసాగించి ఉండుంటే, నేడు ఇండియా లోనే టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న సినిమాటోగ్రాఫర్ గా సరికొత్త చరిత్ర సృష్టించి ఉండేవాడు. అయితే ఇప్పుడు డైరెక్టర్ గా పెద్ద హిట్ కొట్టాడు కదా, మళ్లీ సినిమాటోగ్రఫీ చేయడమో అని అనుకుంటే పొరపాటే. రీసెంట్ గా ‘మిరాయ్’ ప్రొమోషన్స్ కి వచ్చినప్పుడు ‘మీరు చిరంజీవి, బాబీ దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేయబోతున్నారు అంట నిజమేనా?’ అని రిపోర్టర్ అడగ్గా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘అవును అండీ..పని చేయబోతున్నాను. డైరెక్టర్ బాబీ గారు నాకు స్టోరీ ని ఎప్పుడు వివరిస్తాడా అని ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్ ఘట్టమనేని. అంతే కాదు త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ఒక సినిమాకి దర్శకత్వం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట.
మెగాస్టార్ ఇప్పటి వరకు ముట్టుకొని జానర్ ఒకటి ఉంది, ఫ్యాన్స్ కి అది సరికొత్త అనుభూతిని ఇస్తుంది. మెగాస్టార్ నట విశ్వరూపాన్ని చూపించే కథ ఇది , త్వరలోనే ఆయనకు ఈ కథ ని వినిపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్ ఘట్టమనేని. చిరంజీవి ఇప్పటి వరకు చెయ్యని జానర్ అంటూ ఏది మిగిలి లేదు. అలాంటి మెగాస్టార్ తో కార్తీక్ ఎలాంటి జానర్ ని చేయించబోతున్నాడు?, చిరంజీవి చెయ్యని పాత్ర ఏది మిగిలి ఉంది అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతుంది. దీని తర్వాత విశ్వంభర రానుంది. ఈ రెండు పూర్తి అయ్యాక బాబీ, శ్రీకాంత్ ఓదెల సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి అయిన తర్వాతే కార్తీక్ ఘట్టమనేని సినిమా ఉండొచ్చు.