Priyanka Chopra New York restaurant Sona to shut down
Priyanka Chopra: గ్లోబల్ లేడీ ప్రియాంక చోప్రా అట్టహాసంగా ప్రారంభించిన సోనా రెస్టారెంట్ మూతపడనుంది. ఈ మేరకు యాజమాన్యం అధికారిక ప్రకటన చేశారు. సోనా రెస్టారెంట్ సేవలు జూన్ 30తో ముగియనున్నాయి. 2021లో ప్రియాంక చోప్రా-మనీష్ గోయల్ భాగస్వామ్యంలో న్యూయార్క్ వేదికగా సోనా రెస్టారెంట్ లాంచ్ చేశారు. విశిష్టమైన భారతీయ వంటకాలు సోనా రెస్టారెంట్ లో దొరుకుతాయని ప్రచారం చేశారు. సాంప్రదాయ వంటకాలకు మోడ్రన్ టచ్ ఇచ్చి భోజన ప్రియులను ఆకర్షించారు.
ఇండియన్ వెజ్ అండ్ నాజ్ వెజ్ ఫుడ్ సోనా రెస్టారెంట్ లో లభిస్తుంది. ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన సోనా రెస్టారెంట్ సేవలు మూడేళ్ళలోనే ముగియడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాగా దాదాపు ఓ ఏడాది క్రితం సోనా రెస్టారెంట్ భాగస్వామ్యం నుండి ప్రియాంక చోప్రా తప్పుకున్నారు. ఈ వ్యాపారం నుండి ఆమె బయటకు వచ్చారు. ప్రియాంక చోప్రా తప్పుకున్న నెలల వ్యవధిలో సోనా యాజమాన్యం మూసేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Kalki 2898 AD: కల్కి సినిమాలో ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారంటే..?
”మూడేళ్లకు పైగా సాగిన అద్భుత జర్నీ అనంతరం సోనా రెస్టారెంట్ ని మూసేస్తున్నాము. మా రెస్టారెంట్ ని సందర్శించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకు సేవలు అందించడం గౌరవంగా భావిస్తున్నాము..” అని సోనా రెస్టారెంట్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. సోనా రెస్టారెంట్ ని విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అనుపమ్ ఖేర్ వంటి బాలీవుడ్ స్టార్స్ సందర్శించారు. సోనా రెస్టారెంట్ సేవలు నిలిపివేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: Prabhas: ప్రభాస్ తో మల్టీ స్టారర్ సినిమాకి సై అంటున్న బాలీవుడ్ స్టార్ హీరో…
వ్యాపారం ఏదైనా మూసేశారు అంటే దానికి ప్రధాన కారణం లాభాలు రాకనే. కాసులు కురిపించే వ్యాపారాన్ని ఎవరూ క్లోజ్ చేయరు. సోనా రెస్టారెంట్ వ్యాపార భాగస్వామ్యం నుండి ప్రియాంక చోప్రా బయటకు రావడానికి కూడా కారణం ఇదే కావచ్చు. వరల్డ్ క్లాస్ ఫర్నిచర్, ఆంబియన్స్, ఫేమస్ చెఫ్స్ తో… కోట్లు వెచ్చించి సోనా రెస్టారెంట్ బిజినెస్ లాంచ్ చేశారు. అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న ప్రియాంక న్యూయార్క్ లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో సోనా రెస్టారెంట్ ప్రారంభించారు. అది కాస్తా మూతపడింది. హాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్న ప్రియాంక బాలీవుడ్ కి దూరమైన సంగతి తెలిసిందే…
Web Title: Priyanka chopras new york restaurant sona to shut down