Priyanka Chopra: స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తప్పలేదు, హాలీవుడ్ కి వెళ్లిన కొత్తలో ఇవ్వాల్సి వచ్చింది!

Priyanka Chopra: ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ యాక్షన్ సిరీస్ సిటాడెల్ విడుదలకు సిద్ధమైంది. సిటాడెల్ ఏప్రిల్ 28 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. సిటాడెల్ ఇంటర్నేషనల్ వెర్షన్ లో ప్రియాంక నటించారు. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఇటీవల లండన్ లో జరిగిన సిటాడెల్ ప్రీమియర్ షోకి సమంత అండ్ టీమ్ హాజరయ్యారు. సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ […]

Written By: Shiva, Updated On : April 25, 2023 3:27 pm
Follow us on

Priyanka Chopra: ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ యాక్షన్ సిరీస్ సిటాడెల్ విడుదలకు సిద్ధమైంది. సిటాడెల్ ఏప్రిల్ 28 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. సిటాడెల్ ఇంటర్నేషనల్ వెర్షన్ లో ప్రియాంక నటించారు. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఇటీవల లండన్ లో జరిగిన సిటాడెల్ ప్రీమియర్ షోకి సమంత అండ్ టీమ్ హాజరయ్యారు. సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె హాలీవుడ్ లో ఎదురైన అనుభవాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కెరీర్ బిగినింగ్ లో ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ… బాలీవుడ్ లో నేను స్టార్డమ్ అనుభవించాను. అయితే హాలీవుడ్ లో నన్ను కొత్త హీరోయిన్ లా ట్రీట్ చేశారు. ఆఫర్స్ కోసం ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆడిషన్ ఇవ్వడం తప్పేమీ కాదు. ఎలాంటి రికమండేషన్స్ లేకుండా ప్రతిభ ఆధారంగా అవకాశాలు రావడానికి ఆడిషన్స్ మార్గం. ఆడిషన్స్ గెలిచి ఆఫర్స్ పొందిన అప్పటి అనుభవాలు ఇంకా గుర్తు ఉన్నాయన్నారు.

సిటాడెల్ సిరీస్ కి ఎలాంటి ఆడిషన్స్ లేకుండానే నన్ను ఎంపిక చేశారు. ఈ స్థాయికి రావడానికి పదేళ్ల సమయం పట్టింది. నా ప్రతిభ నిరూపించుకోవడం వలన అత్యంత గౌరవం దక్కుతుంది. సిటాడెల్ పోస్టర్స్ లో నాకు కూడా భాగం దక్కుతుంది. మేల్ యాక్టర్స్ కి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇండియన్ స్టార్స్ ప్రతి చోటా కనిపిస్తున్నారు. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ తమ ప్రతిభ నిరూపించుకుంటున్నారు… అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ ని ప్రియాంక రెండు దశాబ్దాలపాటు ఏలారు. అయితే ఆమెను ఇక్కడ తొక్కేశారని ప్రియాంక నేరుగా ఆరోపణలు చేశారు. కొందరు అవకాశాలు రాకుండా చేశారు. బాలీవుడ్ లో అన్నీ రాజకీయాలే. అవి నచ్చకే హిందీ పరిశ్రమకు వెళ్లిపోయానని ప్రియాంక చోప్రా విమర్శలు గుప్పించారు. 2018లో ప్రియాంక చోప్రా అమెరికన్ నటుడు నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్నారు. లాస్ ఏంజెల్స్ లో ఇల్లు కొని అక్కడే కాపురం పెట్టారు. ఇక సిటాడెల్ సీరీస్లో ప్రియాంక చోప్రా బోల్డ్ సన్నివేశాల్లో నటించినట్లు సమాచారం.