Homeఎంటర్టైన్మెంట్Priyanka Arul Mohan: నాని హీరోయిన్ కి మహేష్ పక్కన ఛాన్స్?

Priyanka Arul Mohan: నాని హీరోయిన్ కి మహేష్ పక్కన ఛాన్స్?

Priyanka Arul Mohan: ప్రియాంక అరుళ్ మోహన్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. కోలీవుడ్ ఈ అమ్మడుకి బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా హీరో శివ కార్తికేయన్ తో ఆమె చేసిన డాక్టర్, డాన్ చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి. ఈ రెండు చిత్రాల్లో ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. శివ కార్తికేయన్-ప్రియాంక కోలీవుడ్ హిట్ పెయిర్ గా మారిపోయారు. అలాగే సూర్య హీరోగా విడుదలైన ఈటి సైతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళంలో ఆమె నటించిన లేటెస్ట్ తమిళ చిత్రాలు విజయం సాధించాయి.

Priyanka Arul Mohan
Priyanka Arul Mohan, Mahesh

ఈ క్రమంలో ఆమె ఓ భారీ ఆఫర్ దక్కే సూచనలు కలవని వార్తలు వస్తున్నాయి. మహేష్-త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ ప్రియాంక పేరు పరిశీలిస్తున్నారట. సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ఆమెను సంప్రదించే అవకాశం కలదంటున్నారు. మహేష్ మూవీలో ఏమాత్రం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్నా.. ప్రియాంక ఆఫర్ ఓకే ఆస్కారం కలదు. మహేష్ లాంటి స్టార్ మూవీలో ఛాన్స్ దక్కడం అంటే మామూలు విషయం కాదు.

Also Read: President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల డేట్ వచ్చేసింది.. ఎన్నిక ఎప్పుడు? బరిలో ఎవరంటే?

అయితే తెలుగులో ఆమె ట్రాక్ ఏమంత బాగోలేదు. నాని హీరోగా విడుదలైన గ్యాంగ్ లీడర్ మూవీతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ రివెంజ్ డ్రామా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. అనంతరం శర్వానంద్ శ్రీకారం మూవీలో ఆఫర్ దక్కించుకుంది. విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన శ్రీకారం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ తగ్గుతాయి.

Priyanka Arul Mohan
Priyanka Arul Mohan

మరోవైపు త్రివిక్రమ్ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్స్ పాత్రలకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు. అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా, అల వైకుంఠపురం లో నివేదా పేతురాజ్ సెకండ్ హీరోయిన్ రోల్స్ చేశారు. ఆ చిత్రాలు విజయం సాధించినా వాళ్ళ కెరీర్ కి ఏమాత్రం ప్లస్ కాలేదు. ఈ క్రమంలో ప్రియాంక అరుళ్ మోహన్ తన పాత్రకు ప్రాధాన్యత లేకుంటే ఒప్పుకోక పోవచ్చు. ఇక ఈ మూవీ జులై లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:Nidhhi Agerwal: నిధి ఎద అందాలు దాచలేకున్న కురచ టాప్… టెంప్టింగ్ ఫోజులతో మెంటల్ తెప్పిస్తున్న పవన్ హీరోయిన్!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular