https://oktelugu.com/

Priyanka And Shobha: బిగ్ బాస్ షోకి ఎందుకెళ్లామా అని తలబాదుకుంటున్న ప్రియాంక, శోభ… ఇంతకీ ఏమైంది?

రియాలిటీ షో లో కంటెస్టెంట్స్ రియల్ క్యారెక్టర్ బయట పడుతుంది. వాళ్ళు ప్రవర్తన, మాట తీరు, ఎదుటివారి వారితో నడుచుకునే విధానం, ఎమోషన్స్, ఇలా ప్రతి దాన్ని ఆడియన్స్ చూస్తారు.

Written By: NARESH, Updated On : January 12, 2024 5:43 pm
Priyanka And Shobha

Priyanka And Shobha

Follow us on

Priyanka And Shobha: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది అందరికి కాదు కొందరికి మాత్రమే వరం. ఇందులో పాల్గొని.. ఉన్న పేరు చెడగొట్టుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. బిగ్ బాస్ షో అనేది గొప్ప అవకాశం అని చాలామంది భావిస్తుంటారు. కానీ హౌస్ లోకి వెళ్లి ఎటువంటి నెగిటివిటీ లేకుండా బయటకు రావడం అంత కంటే గొప్ప అని ఆలస్యంగా తెలుసుకుంటారు. ఏదో సాధించాలని వచ్చిన వాళ్ళు .. ఇంకేదో ఇమేజ్ తో బయటకు వస్తారు. ఇది ప్రతి సీజన్ కి ఆనవాయితీ గా మారింది.

ఈ రియాలిటీ షో లో కంటెస్టెంట్స్ రియల్ క్యారెక్టర్ బయట పడుతుంది. వాళ్ళు ప్రవర్తన, మాట తీరు, ఎదుటివారి వారితో నడుచుకునే విధానం, ఎమోషన్స్, ఇలా ప్రతి దాన్ని ఆడియన్స్ చూస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండానే రియల్ క్యారెక్టర్ బయటపడుతుంది. వాళ్ళ గురించి పూర్తిగా ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళను మళ్ళీ వారి క్యారెక్టర్ కి భిన్నమైన పాత్రలో చూసి జీర్ణించుకోలేరు.

అయితే ఇప్పుడు శోభా శెట్టి, ప్రియాంక పరిస్థితి కూడా అలాగే ఉంది. హౌస్ లో ఈ ఇద్దరు ప్రవర్తించిన తీరు కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రియాంక సీరియల్స్ లో పాజిటివ్ రోల్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ హౌస్ లో విశ్వరూపం చూపించింది. అసలు రంగులు బయటపెట్టి షాక్ ఇచ్చింది. ప్రియాంక లో షేడ్స్ చూసిన ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇక శోభా శెట్టి విషయానికొస్తే .. సీజన్ 7 లో ఏ కంటెస్టెంట్ కి రానంత నెగిటివిటీ శోభా కి వచ్చింది.

తన వరెస్ట్ బిహేవియర్ తో ఆడియన్స్ కి చిరాకు తెప్పించింది. ఓవర్ అగ్రెషన్, వెటకారం, ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడుతూ, టాస్కుల్లో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ నెగిటివిటీ మూటగట్టుకుంది. సీరియల్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా విలనే అని నిరూపించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక, శోభా ని ప్రేక్షకులు ఎలాంటి పాత్రలోనైనా ఊహించుకోలేరని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ప్రియాంక శోభా లకు ఆఫర్స్ రావడం కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది. వీరు కర్ణాటక వెళ్లి కన్నడ సీరియల్స్ చేసుకోవాల్సిందే. తెలుగులో కష్టమే అన్న వాదన వినిపిస్తోంది. ఆఫర్స్ వచ్చే సూచనలు కనిపించకపోవడంతో షోకి ఎందుకు వెళ్ళామా? అని తలబాదుకుంటున్నారట.